హనుమాయమ్మది ప్రభుత్వ హత్యే

దళిత మహిళలకు రక్షణ కల్పించాల్సిన అధికార పార్టీ నేతలే వారిని హత్య చేయడం దుర్మార్గమని మాజీ మంత్రి పీతల సుజాత అన్నారు.

Published : 07 Jun 2023 04:24 IST

మాజీ మంత్రి పీతల సుజాత ఆరోపణ

ఈనాడు, అమరావతి: దళిత మహిళలకు రక్షణ కల్పించాల్సిన అధికార పార్టీ నేతలే వారిని హత్య చేయడం దుర్మార్గమని మాజీ మంత్రి పీతల సుజాత అన్నారు. ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం రావివారిపాలెంలో దళిత మహిళ హనుమాయమ్మను వైకాపా నేతలు ట్రాక్టర్‌తో తొక్కించి చంపడం దారుణమని మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనని మండిపడ్డారు. గుంటూరు జిల్లా నకిరేకల్లు మండలం శివాపురం తండాకు చెందిన మంత్రూబాయి అనే గిరిజన మహిళను శ్రీనివాసరెడ్డి గతంలోనూ ట్రాక్టర్‌తో తొక్కించి అతి దారుణంగా హత్య చేశారన్నారు. జగన్‌మోహన్‌రెడ్డికి దళితులంటే చిన్న చూపు కనుకే.. వైకాపా చిల్లర గ్యాంగ్‌ దళిత మహిళలపై పెట్రేగిపోతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

వైకాపా అరాచకాలకు పరాకాష్ఠ: మాణిక్యరావు

హనుమాయమ్మను అత్యంత దారుణంగా వైకాపా నేత కోటేశ్వరరావు హత్య చేయడం వైకాపా అరాచకాలకు పరాకాష్ఠని తెదేపా అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యరావు అన్నారు. మృతురాలి పొత్తి కడుపుపై దున్ని చంపడాన్ని చూస్తే వైకాపా రౌడీలు ఎంతకు బరితెగించారో అర్థమవుతోందని మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. దళిత మహిళలు, ప్రజలపై జగన్‌ దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని, దీనికి సరైన మూల్యం చెల్లించుకునే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని అన్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని