విశ్వసనీయ ప్రత్యామ్నాయంగా వస్తే ప్రజలు ఆదరించొచ్చు

వచ్చే లోక్‌సభ (2024) ఎన్నికలకు ప్రతిపక్షాలన్నీ కలసి విశ్వసనీయ ప్రత్యామ్నాయంగా జట్టుకడితే దేశ ప్రజలు ఆదరించే అవకాశం ఉందని ఎన్సీపీ అధ్యక్షుడు శరద్‌ పవార్‌ అభిప్రాయపడ్డారు.

Published : 07 Jun 2023 04:38 IST

ప్రతిపక్షాల ఐక్యతపై శరద్‌ పవార్‌ వ్యాఖ్య

ఔరంగాబాద్‌: వచ్చే లోక్‌సభ (2024) ఎన్నికలకు ప్రతిపక్షాలన్నీ కలసి విశ్వసనీయ ప్రత్యామ్నాయంగా జట్టుకడితే దేశ ప్రజలు ఆదరించే అవకాశం ఉందని ఎన్సీపీ అధ్యక్షుడు శరద్‌ పవార్‌ అభిప్రాయపడ్డారు. నూతన పార్లమెంటు భవనం విషయంలో అన్ని రాజకీయ పక్షాలతో చర్చించి నిర్ణయం తీసుకుని ఉండి ఉండాల్సిందన్నారు. మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో గల మహాత్మాగాంధీ మిషన్‌ యూనివర్సిటీలో మంగళవారం జరిగిన ‘సౌహార్ద్‌ భైటక్‌’లో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రాల శాసనసభ ఎన్నికల్లో మాదిరిగానే ప్రజలు వ్యవహరిస్తారా? లేదా? అన్నది తన అనుమానమన్నారు. అయితే ప్రతిపక్షాలన్నీ ఏకమై విశ్వసనీయ ప్రత్యామ్నాయంగా నిలబడితే ప్రజలు జైకొట్టే అవకాశం ఉందని పేర్కొన్నారు. విపక్షం తెలివిగా వ్యవహరించకపోతే..ప్రజలు వేరే ఎంపికపై  ఆలోచిస్తారని ఆశించలేమని వ్యాఖ్యానించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని