96 గంటలైనా బాధ్యతేదీ?

ఒడిశా రైలు ప్రమాదంలో స్వీయ వైఫల్యాల నుంచి దృష్టి మరల్చేందుకే ఆ ఘటనపై కేంద్ర ప్రభుత్వం సీబీఐ దర్యాప్తునకు ఆదేశించిందని కాంగ్రెస్‌ ఆక్షేపించింది.

Updated : 07 Jun 2023 06:00 IST

ఒడిశా దుర్ఘటనపై కాంగ్రెస్‌ నిలదీత

దిల్లీ: ఒడిశా రైలు ప్రమాదంలో స్వీయ వైఫల్యాల నుంచి దృష్టి మరల్చేందుకే ఆ ఘటనపై కేంద్ర ప్రభుత్వం సీబీఐ దర్యాప్తునకు ఆదేశించిందని కాంగ్రెస్‌ ఆక్షేపించింది. ఇదంతా మీడియాలో పతాక శీర్షికల నిర్వహణ తప్ప మరొకటి కాదని విమర్శించింది. దుర్ఘటన జరిగి 96 గంటలు గడిచినా ఇప్పటి వరకూ జవాబుదారీతనంగానీ, బాధ్యతగానీ ప్రభుత్వ పక్షం నుంచి లేదని పేర్కొంది. మంగళవారం దిల్లీలో జరిగిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి సుప్రియా శ్రీనేత్‌ ఈ మేరకు మాట్లాడారు.


రైల్వే బడ్జెట్‌ను కేంద్ర బడ్జెట్‌లో కలిపేయడమే తప్పు: మొయిలీ

ఒడిశాలో రైలు ప్రమాదం పెను విషాదం నింపిన నేపథ్యంలో కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి వీరప్ప మొయిలీ కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో రైల్వేలకు ప్రత్యేకంగా ఉన్న బడ్జెట్‌ను కేంద్ర బడ్జెట్‌లో విలీనం చేయడమే ఎన్డీయే ప్రభుత్వం చేసిన పెద్ద తప్పిదమన్నారు. దాని ద్వారానే రైల్వేలపై ప్రత్యేక దృష్టి లేకుండా పోయిందని అభిప్రాయపడ్డారు. గతంలో మాదిరిగా మళ్లీ వేర్వేరుగా బడ్జెట్లు ప్రవేశపెట్టడం అమలు చేయాలని కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని