కేసీఆర్‌ దిల్లీకి వెళ్తే కేటీఆర్‌ ముఖ్యమంత్రి

‘భవిష్యత్తులో కేసీఆర్‌ దిల్లీకి వెళ్తే.. మా ముఖ్యమంత్రి కేటీఆర్‌. అదే కాంగ్రెస్‌, భాజపాల్లో సీఎం అభ్యర్థి ఎవరు? అంటే వారు చెప్పలేరు’ అని శాసనసభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు.

Updated : 08 Jun 2023 04:47 IST

విపక్షాల్లో సీఎం అభ్యర్థి ఎవరు?: సభాపతి పోచారం

వర్ని, న్యూస్‌టుడే: ‘భవిష్యత్తులో కేసీఆర్‌ దిల్లీకి వెళ్తే.. మా ముఖ్యమంత్రి కేటీఆర్‌. అదే కాంగ్రెస్‌, భాజపాల్లో సీఎం అభ్యర్థి ఎవరు? అంటే వారు చెప్పలేరు’ అని శాసనసభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. నిజామాబాద్‌ జిల్లా వర్ని మండలం సిద్ధాపూర్‌ రిజర్వాయర్‌ వద్ద బుధవారం నిర్వహించిన సాగునీటి దినోత్సవంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. సుస్థిర ప్రభుత్వం ఉంటేనే అభివృద్ధి, ప్రజా సంక్షేమం సాధ్యమవుతుందని.. సీఎం కేసీఆర్‌ ఆ రెండింటినీ సమానంగా అమలు చేసి చూపించారని పేర్కొన్నారు. 30 ఏళ్లలో పూర్తి కావాల్సిన కాళేశ్వరం ప్రాజెక్టు.. కేసీఆర్‌ కృషి, పట్టుదలతో మూడేళ్లలోనే పూర్తయిందన్నారు. మిషన్‌ కాకతీయ కింద 22 వేల చెరువులు బాగు చేసుకున్నామన్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని