డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌తోనే తెలంగాణకు న్యాయం

ప్రధాని మోదీ నాయకత్వంలోని భాజపా ప్రభుత్వ పారదర్శక విధానాలతోనే దేశం అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందని భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, ఎంపీ కె.లక్ష్మణ్‌ అన్నారు. బుధవారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో విలేకరులతో  లక్ష్మణ్‌ మాట్లాడారు.

Updated : 08 Jun 2023 04:46 IST

వచ్చేది మోదీ ప్రభుత్వమే: భాజపా నేత లక్ష్మణ్‌

ఈనాడు, హైదరాబాద్‌: ప్రధాని మోదీ నాయకత్వంలోని భాజపా ప్రభుత్వ పారదర్శక విధానాలతోనే దేశం అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందని భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, ఎంపీ కె.లక్ష్మణ్‌ అన్నారు. బుధవారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో విలేకరులతో  లక్ష్మణ్‌ మాట్లాడారు. రాష్ట్రంలో డబుల్‌ ఇంజిన్‌ సర్కారు ఉంటేనే తెలంగాణకు మరింత న్యాయం జరుగుతుందన్నారు. భారాస, కాంగ్రెస్‌ రెండు పార్టీలు ఒకటేనని అన్నారు. రాష్ట్రంలో లక్షా 27 వేల ఉద్యోగాలు ఇచ్చామని అబద్ధాలు చెబుతున్నారని ఆరోపించారు. పాలకులు దళితులకు ఇచ్చిన ఎసైన్డ్‌ భూములను లాక్కుని, అస్మదీయులకు, బంధువులకు భూములను కారుచౌకగా ధారాదత్తం చేస్తున్నారని ఆరోపించారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు