23న పట్నాలో ప్రతిపక్షాల భేటీ

భాజపా వ్యతిరేక ప్రతిపక్ష పార్టీల సమావేశానికి ముహూర్తం ఖరారైంది. ఈ నెల 23న ఆ పార్టీలన్నీ పట్నాలో భేటీ కావాలని నిర్ణయించాయి.

Published : 08 Jun 2023 03:58 IST

పట్నా, దిల్లీ: భాజపా వ్యతిరేక ప్రతిపక్ష పార్టీల సమావేశానికి ముహూర్తం ఖరారైంది. ఈ నెల 23న ఆ పార్టీలన్నీ పట్నాలో భేటీ కావాలని నిర్ణయించాయి. బిహార్‌ ముఖ్యమంత్రి నీతీశ్‌ కుమార్‌ నేతృత్వంలో జరిగే సమావేశానికి కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ, పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ, తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్‌, ఆప్‌ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ హాజరయ్యేందుకు అంగీకరించారు. ఇంకా కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఝార్ఖండ్‌ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్‌, ఎన్సీపీ, శివసేన (యూబీటీ) అధినేతలు శరద్‌పవార్‌, ఉద్ధవ్‌ ఠాక్రే తదితరులు హాజరుకానున్నట్లు బిహార్‌ ఉపముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్‌, జేడీయూ అధ్యక్షుడు రాజీవ్‌ రంజన్‌ సింగ్‌ లలన్‌ బుధవారం విలేకరులకు వెల్లడించారు. సీపీఐ, సీపీఎం, సీపీఐ(ఎంఎల్‌) లిబరేషన్‌ ప్రధాన కార్యదర్శులు డి.రాజా, సీతారాం ఏచూరి, దీపాంకర్‌లు కూడా ఈ భేటీలో పాల్గొంటున్నారని తెలిపారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని