సామాజిక మాధ్యమాల్లో అబద్ధాలను తిప్పికొట్టాలి
భాజపా, కాంగ్రెస్ నాయకులు సామాజిక మాధ్యమాల్లో కేసీఆర్ పాలనపై చెబుతున్న అబద్ధాలను అదే వేదిక ద్వారా తిప్పికొట్టాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత భారాస కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
ఎమ్మెల్సీ కవిత
నిజామాబాద్ అర్బన్, న్యూస్‌టుడే: భాజపా, కాంగ్రెస్ నాయకులు సామాజిక మాధ్యమాల్లో కేసీఆర్ పాలనపై చెబుతున్న అబద్ధాలను అదే వేదిక ద్వారా తిప్పికొట్టాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత భారాస కార్యకర్తలకు పిలుపునిచ్చారు. నిజామాబాద్‌లో బుధవారం నిర్వహించిన భారాస కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ‘మన కార్యకర్తలు నిజాలు తెలియజేసి ప్రజలను చైతన్యవంతులను చేయాలి. ఇందుకు సామాజిక మాధ్యమం వేదిక కావాలి’ అని పిలుపునిచ్చారు. విపక్షాలు నిజాలు చెబితే గౌరవిస్తామని, అసత్యాలు ప్రచారం చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు. కాషాయం కండువాలు కప్పుకొనే భాజపా నేతలు జై జవాన్...జై కిసాన్ నినాదాలు చేస్తారే తప్పిస్తే.. వారిని ఆదుకున్న దాఖలాలు లేవన్నారు. జవాన్లను, రైతులను ఆదుకున్న కేసీఆరే నిజమైన దేశ భక్తుడని కొనియాడారు. రాష్ట్ర అభ్యున్నతికి ఏం చేయాలో నిరంతరం ఆలోచిస్తూనే ఉంటారని చెప్పారు. ఎవరెస్టు శిఖరంలాంటి వ్యక్తి మనకు అండగా ఉన్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌గుప్తా, రాష్ట్ర మహిళా ఆర్థిక సహకార సంస్థ ఛైర్‌పర్సన్ లలిత, నిజామాబాద్ మేయర్ నీతూ కిరణ్ పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
HarishRao: మాటలు చెప్పే సర్కార్ కావాలా? చేతల సర్కార్ కావాలా?: హరీశ్‌రావు
-
TDP: రోజా ఇష్టం వచ్చినట్లు మాట్లాడినందునే బుద్ధి చెప్పా: బండారు
-
Harsha Kumar: ఎన్ని అక్రమ కేసులు పెట్టినా చంద్రబాబును ఏమీ చేయలేరు: హర్షకుమార్
-
Rohit Sharma: కెప్టెన్సీకి సరైన సమయమదే.. అనుకున్నట్లు ఏదీ జరగదు: రోహిత్ శర్మ
-
Arvind Kejriwal: 1000 సోదాలు చేసినా.. ఒక్క పైసా దొరకలేదు: అరవింద్ కేజ్రీవాల్
-
Pakistan: మా దేశం విడిచి వెళ్లిపోండి.. 17లక్షల మందికి పాకిస్థాన్ హుకుం!