గుజరాత్‌, హిమాచల్‌ప్రదేశ్‌ ఎన్నికలకు కాంగ్రెస్‌ పార్టీ ఖర్చు రూ.130 కోట్లు

గత ఏడాది చివరిలో జరిగిన హిమాచల్‌ప్రదేశ్‌, గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికలకు రూ.130 కోట్లు ఖర్చు చేసినట్లు కాంగ్రెస్‌ పార్టీ వెల్లడించింది.

Published : 08 Jun 2023 04:43 IST

హిమాచల్‌లో భాజపా వ్యయం రూ.49 కోట్లు

దిల్లీ: గత ఏడాది చివరిలో జరిగిన హిమాచల్‌ప్రదేశ్‌, గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికలకు రూ.130 కోట్లు ఖర్చు చేసినట్లు కాంగ్రెస్‌ పార్టీ వెల్లడించింది. హిమాచల్‌ ఎన్నికలకు రూ.49 కోట్లను వెచ్చించినట్లు ఎన్నికల సంఘాని(ఈసీ)కి సమర్పించిన వ్యయ నివేదికలో భాజపా పేర్కొంది. గుజరాత్‌లో కషాయదళం ఖర్చుల వివరాలను ఈసీ ఇంకా బహిర్గతం చేయలేదు. ఈ ఎన్నికల్లో గుజరాత్‌లో భాజపా తిరిగి విజయం సాధించగా...హిమాచల్‌ ప్రదేశ్‌ను కమలదళం నుంచి కాంగ్రెస్‌ చేజిక్కించుకున్న విషయం తెలిసిందే.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని