ప్రాంతీయ పార్టీలన్నీ ఒక్కటవ్వాలి

రానున్న లోక్‌సభ ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలన్నీ ఒక్కటవ్వాలని నేషనల్‌ కాన్ఫరెన్స్‌ సీనియర్‌ నాయకుడు ఫరూక్‌ అబ్దుల్లా పిలుపునిచ్చారు.

Published : 08 Jun 2023 04:43 IST

ఫరూక్‌ అబ్దుల్లా పిలుపు

ఈనాడు, బెంగళూరు: రానున్న లోక్‌సభ ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలన్నీ ఒక్కటవ్వాలని నేషనల్‌ కాన్ఫరెన్స్‌ సీనియర్‌ నాయకుడు ఫరూక్‌ అబ్దుల్లా పిలుపునిచ్చారు. బుధవారం ఆయన బెంగళూరులో మాజీ ప్రధానమంత్రి హెచ్‌.డి.దేవేగౌడతో సమావేశమయ్యారు. అనంతరం మాట్లాడుతూ.. కర్ణాటక, కశ్మీర్‌లకు సారూప్యత లేకున్నా రెండు రాష్ట్రాల లక్ష్యం దేశాన్ని ఐక్యం చేయడమేనన్నారు. మత రాజకీయాలను ఎదుర్కొనేందుకు 2024 ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలన్నీ ఏకతాటిపైకి రావాలని విజ్ఞప్తి చేశారు. ఎన్నికలకు సంబంధించి భాజపాయేతర పార్టీలు చేపట్టే కార్యాచరణపై దేవేగౌడతో చర్చించానని తెలిపారు. గతంలో కశ్మీరులో అడుగుపెట్టేందుకు ఏ నాయకుడూ సాహసించని సమయంలో ప్రధాని హోదాలో దేవేగౌడ సరిహద్దుల్లో పర్యటించారని గుర్తుచేశారు. కశ్మీర్‌ ఫైల్స్‌, కేరళ ఫైల్స్‌ వంటి చిత్రాలు శాంతిని దెబ్బతీస్తాయని ఫరూక్‌ అబ్దుల్లా ఆందోళన వ్యక్తం చేశారు. అనంతరం ఆయన కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో సమావేశమయ్యారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని