విజయ డెయిరీలో అమూల్‌ పాలు అమ్మితే తప్పేముంది?: మంత్రి వేణుగోపాలకృష్ణ

‘విజయ డెయిరీలో అమూల్‌ పాలు అమ్మితే లాభమే కదా? దీంట్లో తప్పేముంది? మేం అమూల్‌ను స్వాగతించాం. సాగిలపడలేదు’ అని మంత్రి వేణుగోపాలకృష్ణ పేర్కొన్నారు.

Published : 08 Jun 2023 04:43 IST

ఈనాడు, అమరావతి: ‘విజయ డెయిరీలో అమూల్‌ పాలు అమ్మితే లాభమే కదా? దీంట్లో తప్పేముంది? మేం అమూల్‌ను స్వాగతించాం. సాగిలపడలేదు’ అని మంత్రి వేణుగోపాలకృష్ణ పేర్కొన్నారు. సచివాలయంలో ఆయన బుధవారం విలేకర్లతో మాట్లాడారు. ఈ సందర్భంగా తమిళనాడు, కర్ణాటకలు అమూల్‌ను వద్దని తిరస్కరిస్తే, మీరెందుకు దానికి ప్రాధాన్యమిస్తున్నారని విలేకర్లు అడిగారు. రాష్ట్రంలో అమూల్‌ వచ్చాక పోటీఏర్పడి పాల ధర, పాల సేకరణ పెరిగిందని మంత్రి బదులిచ్చారు.  రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు ఉండవని, 2024లోనే ఎన్నికలకు వెళ్తామని తెలిపారు. తెదేపాకు కేడర్‌ జారిపోతుందనే భయం ఉండటంతో ఎన్నికలకు తొందరపడుతోందన్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు