దొంగ ఓట్లు తొలగించకపోతే కార్పొరేషన్‌ ముట్టడిస్తాం

గుంటూరు శ్యామలానగర్‌లోని ఒక ఇంటి డోర్‌ నంబర్‌పై 140 ఓట్లకు పైగా నమోదైనట్లు గుర్తించిన తెదేపా నేతలు బుధవారం వెళ్లి పరిశీలించారు.

Published : 08 Jun 2023 04:43 IST

కోవెలమూడి రవీంద్ర

పట్టాభిపురం(గుంటూరు), న్యూస్‌టుడే: గుంటూరు శ్యామలానగర్‌లోని ఒక ఇంటి డోర్‌ నంబర్‌పై 140 ఓట్లకు పైగా నమోదైనట్లు గుర్తించిన తెదేపా నేతలు బుధవారం వెళ్లి పరిశీలించారు. ఈ సందర్భంగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గ తెదేపా ఇన్‌ఛార్జి కోవెలమూడి రవీంద్ర మాట్లాడుతూ... ‘తక్షణమే దొంగ ఓట్లను అధికారులు తొలగించాలి. లేదంటే కార్పొరేషన్‌ను   ముట్టడిస్తాం. ఎన్నికల కమిషన్‌ దృష్టికి తీసుకెళ్లి బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకునే వరకు ఈ వ్యవహారాన్ని వదిలిపెట్టేది లేదు...’అని స్పష్టం చేశారు.

కార్యక్రమంలో తెదేపా నాయకులు కనపర్తి శ్రీనివాసరావు, పోపూరి నరేంద్ర, కసుకుర్తి హనుమంతురావు, రావిపాటి సాయికృష్ణ, కన్నెగంటి బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ వ్యవహారంపై డీసీపీ కోటయ్యను విచారణ అధికారిగా నియమించామని, ఏం జరిగిందో తెలుసుకొని ఉద్యోగుల్లో తప్పిదం ఉందని తేలితే చర్యలు తీసుకుంటామని నగరపాలక సంస్థ వర్గాలు తెలిపాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని