చంద్రబాబు గొప్ప నాయకుడు.. భాజపా పెద్దల్ని ఎందుకు కలిశారో ఆయన్నే అడగండి: సోము వీర్రాజు

కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను ఎందుకు కలిశారో.. తెదేపా అధినేత చంద్రబాబునే అడగాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పేర్కొన్నారు.

Updated : 08 Jun 2023 08:06 IST

విజయవాడ: కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను ఎందుకు కలిశారో.. తెదేపా అధినేత చంద్రబాబునే అడగాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పేర్కొన్నారు. ‘చంద్రబాబు గొప్ప నాయకుడు, నేను వెళ్లి ఆయన్ను కలవలేదు. అమిత్‌షాను కలవడాన్నీ నేను వ్యతిరేకించను. పార్టీ పెద్దల్ని ఎవరైనా కలవవచ్చు’ అని విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. రాష్ట్రంలో ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారంటూ సామాజిక మాథ్యమాల్లో జరుగుతున్న ప్రచారంపై అధిష్ఠానం వివరాలు అడిగిందా అని విలేకరులు ప్రశ్నించగా.. అదంతా అవాస్తవమన్నారు. ఉద్యోగాల పేరుతో వసూళ్లలో భాజపా రాష్ట్ర ఎస్సీ మోర్చా అధ్యక్షుడు దేవానంద్‌ పాత్ర ఉందంటూ వస్తున్న ఆరోపణలపై స్పందిస్తూ.. అధిష్ఠానం దృష్టిలో ఉందని, వారే చూస్తారన్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు