నిధులిచ్చేది కేంద్రం.. సొంత పథకాల్లా ఏపీ ప్రభుత్వ ప్రచారం

ప్రజల సంక్షేమాన్ని కాంక్షిస్తూ కేంద్రం నిధులు ఇస్తుంటే.. రాష్ట్ర ప్రభుత్వం ఫొటో వేసుకుని, సొంత పథకాల్లా ప్రచారం చేసుకుంటోందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ సహాయ మంత్రి భారతి ప్రవీణ్‌ పవార్‌ విమర్శించారు.

Published : 08 Jun 2023 05:05 IST

కేంద్ర సహాయ మంత్రి భారతి ప్రవీణ్‌ పవార్‌

ఈనాడు, అమరావతి: ప్రజల సంక్షేమాన్ని కాంక్షిస్తూ కేంద్రం నిధులు ఇస్తుంటే.. రాష్ట్ర ప్రభుత్వం ఫొటో వేసుకుని, సొంత పథకాల్లా ప్రచారం చేసుకుంటోందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ సహాయ మంత్రి భారతి ప్రవీణ్‌ పవార్‌ విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ సహకారం ఉందని ఎక్కడా ప్రస్తావించడం లేదన్నారు. పోషణ్‌ అభియాన్‌ పథకం కింద ఇచ్చే కిట్‌పై కేంద్రం లోగో లేదని పేర్కొన్నారు. విజయవాడలోని భాజపా కార్యాలయంలో బుధవారం తొమ్మిదేళ్ల మోదీ పాలనలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ పథకాలకు సంబంధించిన పుస్తకాలను మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘తొమ్మిదేళ్ల మోదీ పాలనలో కేంద్రం నుంచి ఆంధ్రప్రదేశ్‌కు వివిధపథకాల కింద రూ.8.16లక్షల కోట్లకు పైగా నిధుల్ని అందించాం. కేంద్రం సహకార స్ఫూర్తితో వ్యవహరిస్తుంటే, రాష్ట్ర ప్రభుత్వం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోంది. ఇతర రాష్ట్రాల్లో ప్రొటోకాల్‌ను అనుసరిస్తున్నా, ఆంధ్రప్రదేశ్‌లో మాత్రమే కేంద్ర లోగో పెట్టడం లేదు. నిధులిస్తున్న విషయాన్ని చెప్పడం లేదు’ అని ధ్వజమెత్తారు. ఏపీలోనే ఇలా ఎందుకు జరుగుతుందో అర్థం కావడం లేదన్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు