విశ్వవిద్యాలయాలను వైకాపా కేంద్రాలుగా మార్చడం వల్లే ర్యాంకింగ్‌ పతనం

రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలను వైకాపా రాజకీయ, సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు కేంద్రాలుగా మార్చడం, అధ్యాపకుల పోస్టులు భర్తీ చేయకపోవడంతోనే వాటి ర్యాంకింగ్‌ పడిపోయిందని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు.

Updated : 08 Jun 2023 06:04 IST

తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజం

ఈనాడు డిజిటల్‌, అమరావతి: రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలను వైకాపా రాజకీయ, సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు కేంద్రాలుగా మార్చడం, అధ్యాపకుల పోస్టులు భర్తీ చేయకపోవడంతోనే వాటి ర్యాంకింగ్‌ పడిపోయిందని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. కేంద్ర ఉన్నత విద్యాశాఖ విడుదల చేసిన నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ర్యాంకింగ్‌ ఫ్రేమ్‌ వర్క్‌ నివేదికలో ఏపీలోని విశ్వవిద్యాలయాల ర్యాంకింగ్‌ పతనంపై ఆయన ట్విటర్‌ వేదికగా బుధవారం ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘ఎన్‌ఐఆర్‌ఎఫ్‌ నివేదికను పరిశీలిస్తే... 2019లో దేశంలోనే 29వ స్థానంలో ఉన్న ఆంధ్ర విశ్వవిద్యాలయం.. నేడు 76వ స్థానానికి పడిపోయింది. శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయం టాప్‌-100లో స్థానం పొందలేకపోయింది. యువత భవిష్యత్తును తీర్చిదిద్దడంలో కీలకమైన ఉన్నత విద్యారంగం ఈ నాలుగేళ్లలో వైకాపా ప్రభుత్వ విధానాల వల్ల నాశనమైంది...’’ అని చంద్రబాబు ట్వీట్‌ చేశారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు