వైకాపా నాయకులు రంగురాళ్లను అక్రమంగా తరలించారు

అనకాపల్లి జిల్లా శాలిక మల్లవరం సమీపంలో ఉన్న రిజర్వ్‌ ఫారెస్టులో ప్రభుత్వ అనుమతులు లేకుండానే వైకాపా నాయకులు రంగురాళ్లను అక్రమంగా తరలించారంటూ కర్నూలులోని లోకాయుక్తలో తెదేపా మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు బుధవారం ఫిర్యాదు చేశారు.

Published : 08 Jun 2023 05:05 IST

లోకాయుక్తలో తెదేపా నేత అయ్యన్న పాత్రుడి ఫిర్యాదు

కర్నూలు విద్య, నంద్యాల పట్టణం, న్యూస్‌టుడే: అనకాపల్లి జిల్లా శాలిక మల్లవరం సమీపంలో ఉన్న రిజర్వ్‌ ఫారెస్టులో ప్రభుత్వ అనుమతులు లేకుండానే వైకాపా నాయకులు రంగురాళ్లను అక్రమంగా తరలించారంటూ కర్నూలులోని లోకాయుక్తలో తెదేపా మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు బుధవారం ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దీనిపై స్థానికంగా ఉన్న అటవీ శాఖ అధికారులు, ఆర్డీవో, పోలీసులకు తెలిపినా.. ఫలితం లేకపోవడంతో లోకాయుక్తలో ఫిర్యాదు చేశామన్నారు. ఈ ఘటనలో ఓ చిన్నస్థాయి ఉద్యోగిని మాత్రమే సస్పెండ్‌ చేశారని తెలిపారు. పూర్తిస్థాయి విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని లోకాయుక్తను కోరినట్లు పేర్కొన్నారు. ఆయన వెంట తెదేపా నాయకుడు కేఈ ప్రభాకర్‌ తదితరులు ఉన్నారు.

సునీత పోరాటం అభినందనీయం

కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులుగా పనిచేసిన వారిని సైతం అరెస్టు చేసిన సీబీఐ.. వివేకా హత్య కేసులో ఒక ఎంపీని ఎందుకు అరెస్టు చేయడం లేదని అయ్యన్నపాత్రుడు ప్రశ్నించారు. ఈ కేసు విషయంలో వైఎస్‌ సునీత చేస్తున్న పోరాటం అభినందనీయమని పేర్కొన్నారు. బుధవారం నంద్యాలలోని తెదేపా కార్యాలయానికి వచ్చిన ఆయన్ను మాజీ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌, నియోజకవర్గ తెదేపా ఇన్‌ఛార్జి భూమా బ్రహ్మానందరెడ్డి సన్మానించారు. ఈ సందర్భంగా అయ్యన్న మాట్లాడుతూ దుర్మార్గులపై సునీత చేస్తున్న పోరాటానికి ప్రజా మద్దతు అవసరమన్నారు. సీబీఐ కేసులో న్యాయస్థానానికి వెళ్లకుండా ఇన్నేళ్లు ఉండడం ఒక్క సీఎం జగన్‌కే సాధ్యమని వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో తెదేపా నేత ఏరాసు ప్రతాప్‌రెడ్డి, ఇతర నాయకులు పాల్గొన్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు