ఉపాధ్యాయుల బిల్లులు మంజూరు చేయండి: ఎమ్మెల్సీ రఘోత్తంరెడ్డి
రాష్ట్రవ్యాప్తంగా ఏడాదికాలంగా పెండింగ్‌లో ఉన్న ఉపాధ్యాయుల సరెండర్ లీవ్, మెడికల్, జీపీఎఫ్ బిల్లులను వెంటనే మంజూరు చేయాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ రఘోత్తంరెడ్డి ప్రభుత్వాన్ని కోరారు.
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ఏడాదికాలంగా పెండింగ్‌లో ఉన్న ఉపాధ్యాయుల సరెండర్ లీవ్, మెడికల్, జీపీఎఫ్ బిల్లులను వెంటనే మంజూరు చేయాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ రఘోత్తంరెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. గురువారం హైదరాబాద్‌లో నిర్వహించిన పీఆర్‌టీయూటీఎస్ కార్యవర్గ సమావేశంలో ఎమ్మెల్సీ మాట్లాడారు. వైద్య బిల్లులు, నెలనెలా దాచుకున్న జీపీఎఫ్ డబ్బులు రాక వేలాది మంది ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధ్యాయుల ఇబ్బందిని ఆసరా చేసుకుని పర్సంటేజీలకు బిల్లులు మంజూరు చేస్తున్న ట్రెజరీ కార్యాలయ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలన్నారు. ఈ నెల 13వ తేదీ అనంతరం కోర్టు తీర్పు అనుసరించి బదిలీలు వీలుకాని పక్షంలో ఉపాధ్యాయులకు తాత్కాలిక పద్ధతిలో పదోన్నతులు కల్పించాలన్నారు. సమావేశంలో పీఆర్‌టీయూటీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీపాల్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి బీరెల్లి కమలాకర్‌రావు తదితరులు పాల్గొన్నారు.
ప్రత్యేక జీఓ జారీ చేయాలి: పీఆర్‌టీయూ తెలంగాణ
హైకోర్టు స్టే బదిలీలకు మాత్రమే ఉన్నందున పదోన్నతులకు ప్రత్యేకంగా జీఓ జారీ చేసి ఉపాధ్యాయులకు న్యాయం చేయాలని పీఆర్‌టీయూ తెలంగాణ కోరింది. గురువారం హైదరాబాద్‌లోని సంఘ కార్యాలయంలో జరిగిన అత్యవసర కార్యవర్గ సమావేశంలో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎం.చెన్నయ్య, ప్రధాన కార్యదర్శి భిక్షంగౌడ్ మాట్లాడారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Canada: తొలిసారి.. కెనడా దిగువ సభ స్పీకర్‌గా ఆఫ్రో-కెనడియన్!
-
Team India: టీమ్ఇండియా ఆటగాళ్ల రీల్.. కోహ్లీ లేకపోవడాన్ని ప్రశ్నిస్తున్న అభిమానులు
-
Festival Sale: ఐఫోన్, పిక్సెల్, నథింగ్.. ప్రీమియం ఫోన్లపై పండగ ఆఫర్లివే!
-
Shashi Tharoor: తిరువనంతపురం పేరు.. ‘అనంతపురి’ పెడితే బాగుండేది..!
-
Malavika Mohanan: నన్ను కాదు.. ఆ ప్రశ్న దర్శకుడిని అడగండి: మాళవికా మోహనన్
-
World Cup-Sachin: వన్డే ప్రపంచకప్.. సచిన్ తెందూల్కర్‌కు అరుదైన గౌరవం