వచ్చే ఎన్నికల్లో యూత్ కాంగ్రెస్‌దే కీలకపాత్ర
ప్రియాంకగాంధీ హైదరాబాద్ యూత్ డిక్లరేషన్‌పై విస్తృత ప్రచారం చేయాలని ఏఐసీసీ కార్యదర్శి, ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పేర్కొన్నారు.
జాతీయ యువజన కాంగ్రెస్ కార్యవర్గ సమావేశంలో ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు
గాంధీభవన్, న్యూస్‌టుడే: ప్రియాంకగాంధీ హైదరాబాద్ యూత్ డిక్లరేషన్‌పై విస్తృత ప్రచారం చేయాలని ఏఐసీసీ కార్యదర్శి, ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో యువజన కాంగ్రెస్ కీలకంగా వ్యవహరించాలన్నారు. హైదరాబాద్‌లో జరుగుతున్న మూడురోజుల జాతీయ యువజన కాంగ్రెస్ కార్యవర్గ సమావేశాల్లో రెండోరోజు గురువారం ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ప్రజల్లో ఉంటూ వారి సమస్యలపై పోరాటాలు చేసే వారికి ఎన్నికల్లో టికెట్లు ఇచ్చే విషయాన్ని అధిష్ఠానం పరిశీలిస్తుందన్నారు. యువజన కాంగ్రెస్‌లో మహిళలకు పెద్దపీట వేస్తామని హామీ ఇచ్చారు. యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివసేనారెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎన్నికల్లో యూత్ కాంగ్రెస్ సోషల్ మీడియా వేదికగా పోషించాల్సిన పాత్ర, పార్టీ బలోపేతం కోసం చేపట్టాల్సిన కార్యాచరణ తదితర అంశాలపై చర్చించారు. విభాగం జాతీయ అధ్యక్షుడు బి.వి.శ్రీనివాస్, 29 రాష్ట్రాల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు హాజరయ్యారు. శుక్రవారం ముగింపు సమావేశాలకు పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి హాజరై ఉపన్యసించనున్నారు.
10న పీసీసీ ముఖ్యనేతల సమావేశం
ఈ నెల 10న పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శుల సమావేశం ఏర్పాటు చేసినట్లు పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ గురువారం తెలిపారు. సమావేశానికి రేవంత్‌రెడ్డితో పాటు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణిక్‌రావ్ ఠాక్రే, ఏఐసీసీ ఇన్‌ఛార్జి కార్యదర్శులు హాజరవుతారన్నారు. పార్టీ సంస్థాగత అంశాలు, తాజా రాజకీయ పరిస్థితులపై చర్చిస్తారన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Amazon Prime Video: అమెజాన్ ప్రైమ్ చందాదారులా? అయితే, ఈ విషయం తెలుసా?
-
Kannappa: మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌లో ప్రభాస్‌తో పాటు ఆ స్టార్ హీరోయిన్!
-
IND vs AUS: ఆసీస్‌తో రెండో వన్డే.. శ్రేయస్ అయ్యర్‌కు ఇదేనా చివరి ఛాన్స్..?
-
Vizag: సిగరెట్ కోసం స్నేహితుడినే హతమార్చారు!
-
social look: అనుపమ ఉవాచ.. రష్మిక ఫస్ట్‌లుక్.. ఇంకా ఎన్నో ముచ్చట్లు..
-
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (24/09/2023)