నియామకాల పేరిట దోపిడీ: ప్రవీణ్‌కుమార్
నీళ్లు, నిధులు, నియామకాల పేరిట తెలంగాణలో అధికారంలోకి వచ్చిన సీఎం కేసీఆర్ లిక్కర్, లీకేజీ, లిఫ్ట్ ఇరిగేషన్‌లలో అక్రమాలకు పాల్పడి దోపిడీ పాలన కొనసాగిస్తున్నారని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.ఎస్.ప్రవీణ్‌కుమార్ ఆరోపించారు.
బాన్సువాడ, న్యూస్‌టుడే: నీళ్లు, నిధులు, నియామకాల పేరిట తెలంగాణలో అధికారంలోకి వచ్చిన సీఎం కేసీఆర్ లిక్కర్, లీకేజీ, లిఫ్ట్ ఇరిగేషన్‌లలో అక్రమాలకు పాల్పడి దోపిడీ పాలన కొనసాగిస్తున్నారని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.ఎస్.ప్రవీణ్‌కుమార్ ఆరోపించారు. గురువారం కామారెడ్డి జిల్లా బాన్సువాడలో ర్యాలీ నిర్వహించి డా.బి.ఆర్.అంబేడ్కర్ విగ్రహానికి నివాళులర్పించారు అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఏం సాధించారని దశాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తున్నారని కేసీఆర్‌ను ప్రశ్నించారు. భారాస ప్రభుత్వం ప్రజలను బలవంతంగా తరలిస్తూ సంబురాలు నిర్వహిస్తోందని, వీటిని బహిష్కరించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. భారాస, భాజపా రెండు మోసపూరిత పార్టీలేనని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని, ఎవరైనా మా ఎజెండాను నమ్మి ముందుకు వస్తే కలిసి పోరాడుతామని అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
ఎక్స్ ఇండియా హెడ్ రాజీనామా.. కారణమిదేనా?
-
Cricket News: సిరాజ్ స్పెషల్ అదేనన్న ఏబీడీ... జట్టుకు కాంబినేషనే కీలకమన్న షమీ!
-
Chandrababu Arrest: చంద్రబాబు విడుదలయ్యే వరకు దీక్ష కొనసాగిస్తా: కాలవ శ్రీనివాసులు
-
Vikasraj: అక్టోబరులో రాష్ట్రానికి కేంద్ర ఎన్నికల బృందం: సీఈవో వికాస్ రాజ్
-
Gurpatwant Singh Pannun: పన్నూ వార్నింగ్ ఇస్తే.. కేంద్రం షాకిచ్చింది: ఆస్తులు స్వాధీనం చేసుకున్న ఎన్ఐఏ
-
politics: భాజపా - జేడీఎస్ పొత్తు.. ‘బెస్ట్ ఆఫ్ లక్’ అంటూ కాంగ్రెస్ వ్యంగ్యాస్త్రాలు