కాంగ్రెస్‌ గూటికి పొంగులేటి?

మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాజకీయ పయనంపై స్పష్టత వచ్చినట్లు కనిపిస్తోంది. ఖమ్మంలో శుక్రవారం ఉదయం అల్పాహార విందు భేటీకి హాజరుకావాలని మండలాల వారీగా ముఖ్య నాయకులకు సమాచారం చేరవేశారు.

Updated : 09 Jun 2023 05:47 IST

నేడు ముఖ్య నాయకులతో సమావేశం

ఈటీవీ- ఖమ్మం: మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాజకీయ పయనంపై స్పష్టత వచ్చినట్లు కనిపిస్తోంది. ఖమ్మంలో శుక్రవారం ఉదయం అల్పాహార విందు భేటీకి హాజరుకావాలని మండలాల వారీగా ముఖ్య నాయకులకు సమాచారం చేరవేశారు. ఈ సందర్భంగా ఏ పార్టీలో చేరాలన్న నిర్ణయాన్ని వెల్లడిస్తారని తెలిసింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పది నియోజకవర్గాల్లో ఆయన నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనాల్లో ముఖ్యనాయకులు, అనుచరుల్లో అత్యధిక మంది కాంగ్రెస్‌లో చేరాలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అయినప్పటికీ రాజకీయంగా ఆచితూచి అడుగులు వేస్తూ వస్తున్నారు. రకరకాల ప్రచారాలు జరిగినప్పటికీ కర్ణాటక ఎన్నికల ఫలితాల తరువాత నుంచి కాంగ్రెస్‌ వైపే మొగ్గు చూపుతున్నారని గట్టిగా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ నెలాఖరులోగా ఖమ్మంలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభలో ఆయనతోపాటు మాజీ మంత్రి జూపల్లి, రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి కలిసి వచ్చే నేతలందరూ ఒకేసారి కాంగ్రెస్‌ గూటికి చేరతారని సమాచారం.

అరచేతిలో స్వర్గం చూపడంలో కేసీఆర్‌, కేటీఆర్‌ దిట్ట: జి.నిరంజన్‌

గాంధీభవన్‌, న్యూస్‌టుడే: ప్రజలకు అరచేతిలో స్వర్గం చూపెట్టడంలో సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌లు దిట్టలని పీసీసీ సీనియర్‌ ఉపాధ్యక్షుడు జి.నిరంజన్‌ ఎద్దేవాచేశారు. ఆయన గురువారం గాంధీభవన్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ములుగు, వరంగల్‌ జిల్లాల పర్యటనలో మంత్రి కేటీఆర్‌ కాంగ్రెస్‌పై చేసిన వ్యాఖ్యలను ఖండించారు. కాంగ్రెస్‌ మాటల్లో పడి ప్రజలు మోసపోవద్దనడం విడ్డూరంగా ఉందన్నారు. కాంగ్రెస్‌ గురించి మాట్లాడే కనీస అర్హత కేటీఆర్‌కు లేదని పీసీసీ సీనియర్‌ ఉపాధ్యక్షుడు మల్లు రవి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలు తమ పార్టీకి పట్టం కట్టడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని