భూముల్ని కొట్టేయడంపైనే కేబినెట్ దృష్టంతా
వివాదాస్పద, చుక్కల భూముల్ని వైకాపా వాళ్లకు, తన వర్గానికి కట్టబెట్టేందుకు సీఎం జగన్ ఉవ్విళ్లూరుతున్నారని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు ధ్వజమెత్తారు.
తెదేపా నేత బొండా ఉమ ధ్వజం
ఈనాడు డిజిటల్, అమరావతి: వివాదాస్పద, చుక్కల భూముల్ని వైకాపా వాళ్లకు, తన వర్గానికి కట్టబెట్టేందుకు సీఎం జగన్ ఉవ్విళ్లూరుతున్నారని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు ధ్వజమెత్తారు. బుధవారం జరిగిన కేబినెట్ సమావేశంలో తీసుకున్న 63 నిర్ణయాల్లో 23 భూములకు సంబంధించినవే ఉండటం ఇందుకు నిదర్శనమని మండిపడ్డారు. గుజరాత్ సంస్థ అమూల్‌ను అనేక రాష్ట్రాలు తిరస్కరిస్తుంటే..జగన్ ప్రభుత్వం మాత్రం రూ.అయిదు వేల కోట్ల ప్రజాధనాన్ని దోచిపెట్టి రాష్ట్రంలోని పాడిపరిశ్రమను నాశనం చేయడానికి సిద్ధమైందని విమర్శించారు. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘‘దొరికినంత దోచుకోండి అనేలా మంత్రిమండలి నిర్ణయాలు ఉన్నాయి. చిత్తూరు డెయిరికీ సంబంధించిన 29 ఎకరాల భూమిని 99 ఏళ్లపాటు అమూల్‌కు లీజుకివ్వడం క్విడ్‌ప్రోకోలో భాగమే. తెదేపా ప్రభుత్వం వచ్చాక వైకాపా సర్కారు తీసుకున్న అన్ని నిర్ణయాలను సమీక్షిస్తాం. ప్రజల ఆస్తులు, ప్రభుత్వ భూములు కొట్టేసిన వారిని, అందుకు సహకరించిన అధికారులను వదిలిపెట్టం’’ అని ఉమా హెచ్చరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
దిల్లీ మద్యం కేసులో అప్రూవర్లుగా మాగుంట రాఘవ్, దినేష్ అరోరా
-
RK Roja: తెదేపాను వీడినప్పటి నుంచి కక్ష కట్టారు: మంత్రి రోజా
-
YS Jagan: రేపు దిల్లీకి సీఎం జగన్.. హఠాత్తుగా సామర్లకోట పర్యటన వాయిదా
-
స్నేహితులను వరించిన అదృష్టం.. లాటరీలో రూ.కోటిన్నర గెలుపు
-
Engineering Counselling: ఏపీలో ఇంజినీరింగ్‌లో మూడో విడత కౌన్సెలింగ్ ఎత్తివేత
-
Guntur: సహజీవనం నేపథ్యంలో వివాదం.. యువకుడిపై మహిళ యాసిడ్ దాడి