Congress: తెలంగాణకు కొత్తగా ఇద్దరు ఏఐసీసీ ఇన్‌ఛార్జి కార్యదర్శులు

తెలంగాణ రాష్ట్రానికి కాంగ్రెస్‌ కొత్తగా ఇద్దరు ఇన్‌ఛార్జి కార్యదర్శులను నియమించింది.

Published : 09 Jun 2023 21:17 IST

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రానికి కొత్తగా ఇద్దరు ఏఐసీసీ ఇన్‌ఛార్జి కార్యదర్శులను కాంగ్రెస్‌ అధిష్ఠానం నియమించింది. కర్ణాటక రాష్ట్రానికి చెందిన మన్సూర్‌ అలీఖాన్‌, కేరళకు చెందిన పీసీ విష్ణునాథ్‌లను రాష్ట్ర ఏఐసీసీ ఇన్‌ఛార్జిలుగా ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ నియమించారు. ఇప్పటి వరకు ఏఐసీసీ కార్యదర్శిగా ఉంటున్న నదీం జావిద్‌ను బాధ్యతల నుంచి అధిష్టానం తప్పించింది. అదేవిధంగా ఇటీవల కర్ణాటక మంత్రిగా నియమితులైన బోసురాజును కూడా బాధ్యతలను నుంచి తప్పించింది. వారిద్దరి స్థానంలో కర్ణాటకకు చెందిన మన్సూర్‌ అలీఖాన్‌, కేరళకు చెందిన విష్ణునాథ్‌లను నియమించారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు