ఏ పార్టీలో చేరేదీ మూడు నాలుగు రోజుల్లో చెబుతా: పొంగులేటి

అనుచరుల అభీష్టమే తన అభిమతమని, అందరి ఆకాంక్ష మేరకే తాను నడుచుకుంటానని ఖమ్మం మాజీ ఎంపీ, సీనియర్‌ నేత పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు.

Updated : 10 Jun 2023 06:39 IST

ఈటీవీ- ఖమ్మం: అనుచరుల అభీష్టమే తన అభిమతమని, అందరి ఆకాంక్ష మేరకే తాను నడుచుకుంటానని ఖమ్మం మాజీ ఎంపీ, సీనియర్‌ నేత పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఏ పార్టీలో చేరుతానన్న విషయాన్ని మూడు, నాలుగు రోజుల్లో హైదరాబాద్‌ వేదికగా ప్రకటిస్తానని అన్నారు. ఖమ్మంలో శుక్రవారం నిర్వహించిన ముఖ్యనాయకుల సమావేశంలో పొంగులేటి ఈ వ్యాఖ్యలు చేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పది నియోజకవర్గాల నుంచి తరలివచ్చిన నాయకులు, ముఖ్యకార్యకర్తల అభిప్రాయం మేరకే నడుచుకుంటానని, అందరి మనసులో మొదటి నుంచీ ఒకే ఆలోచన ఉందన్న విషయం తనకు అర్థమైందన్నారు. లక్షలాది మంది అభిమానులు, కార్యకర్తల సమక్షంలో ఖమ్మం బహిరంగ సభలోనే పార్టీ కండువా కప్పుకొంటానని ప్రకటించారు. జెండా, ఎజెండా లేదంటూ తనను ఇంతకాలం విమర్శించిన అధికార పార్టీ నేతలకు ఇప్పుడు కంటిమీద కునుకులేకుండా పోయిందని ఎద్దేవా చేశారు. గతంలో ఒక జాతీయ పార్టీలోకి వెళ్తున్నానని కొందరు నాయకులు ప్రచారం కల్పించి దావత్‌ చేసుకున్నారని ఈ సందర్భంగా పొంగులేటి ప్రస్తావించారు. కల్వకుంట్ల కుటుంబం నుంచి రాష్ట్రానికి విముక్తి కల్పించడమే తమ లక్ష్యమని అన్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని