కేసీఆర్‌ది సంక్షేమ స్వర్ణయుగం: కవిత
రాష్ట్రంలోని అన్ని వర్గాల అభ్యున్నతికి ఎన్నో పథకాలు ప్రవేశపెట్టి సంక్షేమ స్వర్ణయుగం తీసుకొచ్చిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు.
డిచ్‌పల్లి, న్యూస్‌టుడే: రాష్ట్రంలోని అన్ని వర్గాల అభ్యున్నతికి ఎన్నో పథకాలు ప్రవేశపెట్టి సంక్షేమ స్వర్ణయుగం తీసుకొచ్చిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని శుక్రవారం నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లిలో నిర్వహించిన తెలంగాణ సంక్షేమ సంబురాలులో ఎమ్మెల్సీ పాల్గొని మాట్లాడారు. తెలంగాణలోని కుల వృత్తుదారులకు రూ.లక్ష చొప్పున సాయం, స్థలం ఉన్నవారు ఇంటిని నిర్మించుకునేందుకు రూ.3 లక్షల చొప్పున ఇచ్చేందుకు గృహలక్ష్మి పథకం ప్రవేశపెట్టినట్లు గుర్తుచేశారు. 15 రాష్ట్రాల్లో బీడీ కార్మికులు ఉన్నా.. ఒక్క తెలంగాణలోనే జీవనభృతి పింఛన్లు ఇస్తున్నామని వివరించారు. భాజపాకు సంక్షేమం, సంస్కారం లేదని విమర్శించారు. కాంగ్రెస్, భాజపా నాయకులకు కంటి పరీక్షలు చేస్తేనే అభివృద్ధి కనిపిస్తుందన్నారు. టీఎస్‌ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ.. హిందూ మతానికి ప్రమాదం ఉందని భాజపా ప్రచారం చేస్తోందని, ప్రధాని, కేంద్ర హోంమంత్రి, రాష్ట్రపతి హోదాల్లో హిందువులే ఉండగా ఎందుకు ప్రమాదం ఉంటుందని ప్రశ్నించారు. అనంతరం భారాస నాయకులు ఎమ్మెల్సీ కవిత, టీఎస్‌ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్‌ను పూలమాలతో సత్కరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Chandrababu : క్వాష్ పిటిషన్‌పై హైకోర్టు ఆదేశాలను సుప్రీంలో సవాల్ చేసిన చంద్రబాబు
-
Narendra Modi: శివతత్వం ప్రతిబింబించేలా వారణాసి క్రికెట్ స్టేడియం..
-
Crime News: కుమారుడిని చంపి.. ఇంటి ముందు పడేసి: ‘మీ సింహమిదిగో’ అంటూ హేళన
-
Nani: అప్పుడే మొదటి సారి ప్రేమలో పడ్డా.. ప్రస్తుతం తనే నా క్రష్: నాని
-
Madhapur Drugs Case: నటుడు నవదీప్‌ను ప్రశ్నిస్తున్న నార్కోటిక్స్ పోలీసులు