మట్టి అక్రమాలు నిజమే

పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలం చించినాడ గోదావరి పెరుగులంక భూముల నుంచి అక్రమంగా మట్టి తరలిస్తున్న లారీని పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, సీపీఎం నాయకులు శుక్రవారం పట్టుకున్నారు.

Updated : 10 Jun 2023 06:27 IST

నిఘా పెట్టి లారీ పట్టుకున్న ఎమ్మెల్యే నిమ్మల, సీపీఎం నాయకులు

పాలకొల్లు, న్యూస్‌టుడే: పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలం చించినాడ గోదావరి పెరుగులంక భూముల నుంచి అక్రమంగా మట్టి తరలిస్తున్న లారీని పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, సీపీఎం నాయకులు శుక్రవారం పట్టుకున్నారు. పేదల లేఅవుట్ల కోసమని కొన్నాళ్లుగా పెరుగులంక భూముల్లో మట్టి తవ్వుతున్నారు. కానీ, అందులో ఎక్కువ భాగం బయట విక్రయిస్తున్నారని మొదట్నుంచీ ఎమ్మెల్యే, సీపీఎం నాయకుడు కానేటి బాలరాజు ఆరోపిస్తున్నారు. దీన్ని అధికారులు పట్టించుకోవడం లేదని గురువారం రాత్రి నుంచి వారే నిఘా పెట్టారు. ఈ క్రమంలో పెరుగులంక నుంచి వెళ్లిన ఓ లారీ శుక్రవారం ఉదయం మేడపాడులోని ఇటుకల బట్టీ వద్ద మట్టి దించుతుండగా దాన్ని పట్టుకొన్నారు. పోలీసులకు సమాచారం ఇచ్చారు. భీమవరం డీఎస్పీ శ్రీకాంత్‌ వచ్చి ఎమ్మెల్యేతో మాట్లాడి.. దర్యాప్తు చేస్తామని తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ అసైన్డ్‌ భూముల కమిటీ ఛైర్మన్‌గా ఉన్న తననే లంక భూముల్లోకి అనుమతించని డీఎస్పీ తదితరులు మట్టి దొంగలకు కాపలా కాస్తున్నారని ఆరోపించారు. నరసాపురం వెళ్లి సబ్‌ కలెక్టరుకు వినతిపత్రం ఇచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని