రాష్ట్ర ప్రభుత్వ విధానాలపై ఉద్యమిస్తాం
రాష్ట్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై ఉద్యమిస్తామని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పేర్కొన్నారు. భాజపా తొమ్మిదేళ్ల పాలనపై శనివారం శ్రీకాళహస్తిలో నిర్వహించనున్న బహిరంగ సమావేశానికి ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జె.పి.నడ్డా ప్రత్యేక ఆహ్వానితులుగా రానున్నారు.
భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు
శ్రీకాళహస్తి, న్యూస్‌టుడే: రాష్ట్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై ఉద్యమిస్తామని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పేర్కొన్నారు. భాజపా తొమ్మిదేళ్ల పాలనపై శనివారం శ్రీకాళహస్తిలో నిర్వహించనున్న బహిరంగ సమావేశానికి ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జె.పి.నడ్డా ప్రత్యేక ఆహ్వానితులుగా రానున్నారు. ఈ సమావేశ ఏర్పాట్లను రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావుతో కలిసి శుక్రవారం ఆయన పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ సుపరిపాలన గురించి ప్రజలకు తెలియజేస్తూ దేశవ్యాప్తంగా సమావేశాలు నిర్వహిస్తున్నామన్నారు. మూడు జిల్ల్లాల్లో జరిగే సభల్లో కేంద్ర మంత్రి మురళీధరన్‌తో పాటు పలువురు ఎంపీలు రాష్ట్రానికి వస్తున్నట్లు వెల్లడించారు. ఈ నెల 20 నుంచి 30 వరకు ఇంటింటికీ వెళ్లి కేంద్ర ప్రభుత్వ పథకాలను వివరిస్తామని తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
సూరత్‌లో రూ.600 కోట్ల వజ్ర గణపతి
-
లేచి నిలబడి భక్తులను దీవిస్తున్న వినాయకుడు!
-
Bhuma Akhila Priya: భూమా అఖిలప్రియ నిరాహార దీక్ష భగ్నం
-
Team India: భారత క్రికెట్ చరిత్రలో అరుదైన ఫీట్..
-
Vijay Deverakonda: ఆ బ్రాండ్‌కు విజయ్ దేవరకొండ బై.. ఈసారి అంతకుమించి!
-
Mohajer-10: 2 వేల కి.మీల దూరం.. 24 గంటలు గాల్లోనే.. సరికొత్త డ్రోన్లు ప్రదర్శించిన ఇరాన్