తమ్ముడి కోసమే జగన్‌ గుడివాడ పర్యటన రద్దు

సుప్రీంకోర్టులో కడప ఎంపీ అవినాష్‌రెడ్డి బెయిల్‌ పిటిషన్‌ విచారణ ఉండటంతోనే సీఎం జగన్‌ శుక్రవారం గుడివాడ పర్యటనను రద్దు చేసుకున్నారని తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఉత్తరాంధ్ర ఇన్‌ఛార్జి బుద్దా వెంకన్న పేర్కొన్నారు.

Published : 10 Jun 2023 05:09 IST

గుడివాడలో కొడాలి నాని గెలవరు
తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్దా వెంకన్న

ఈనాడు, అమరావతి: సుప్రీంకోర్టులో కడప ఎంపీ అవినాష్‌రెడ్డి బెయిల్‌ పిటిషన్‌ విచారణ ఉండటంతోనే సీఎం జగన్‌ శుక్రవారం గుడివాడ పర్యటనను రద్దు చేసుకున్నారని తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఉత్తరాంధ్ర ఇన్‌ఛార్జి బుద్దా వెంకన్న పేర్కొన్నారు. టిడ్కో ఇళ్ల పంపిణీ పేరుతో భారీగా బస్సులను సమీకరించి ప్రజాధనం వృథా చేశారని ఆరోపించారు. శుక్రవారం విజయవాడలో విలేకరులతో ఆయన మాట్లాడారు. అవినాష్‌ బెయిల్‌ రద్దయితే ఏం చేయాలనే వ్యూహం రూపొందించేందుకే జగన్‌ తాడేపల్లి ప్యాలెస్‌ దాటడం లేదని వివరించారు. అవినాష్‌ను అరెస్టు చేయకుండానే చేసినట్లు సీబీఐ ఎలా చెబుతోందని ప్రశ్నించారు. పోలీసులు లేకుండా వైకాపా ఎమ్మెల్యేలు గడపగడపకు తిరగగలరా? అని ప్రశ్నించారు. పులివెందుల పులి జగన్‌ కాదని, నిజమైన పులి వివేకా కుమార్తె సునీత అని వివరించారు. వచ్చే ఎన్నికల్లో గుడివాడలో కొడాలి నాని గెలవబోరని, సీఎం జగన్‌ కాదు కదా.. ఆయన తండ్రి వైఎస్‌ దిగివచ్చి ప్రచారం చేసినా నాని గెలిచే ప్రసక్తి లేదని పేర్కొన్నారు. తెదేపా అధినేత చంద్రబాబుపై స్పీకర్‌, డిప్యూటీ స్పీకర్‌లు అవాకులు చవాకులు పేలుతున్నారని ఆరోపించారు. ఎంపీ కేశినేని నాని వ్యాఖ్యలను తాను వ్యక్తిగతంగా తీసుకోనని, వాటిపై స్పందించబోనని చెప్పారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు