DH Srinivasa Rao: సీఎం అవకాశమిస్తే కొత్తగూడెంలో పోటీ చేస్తా: గడల

వచ్చే ఎన్నికల్లో సీఎం కేసీఆర్‌ అవకాశమిస్తే కొత్తగూడెం నియోజకవర్గం నుంచి భారాస అభ్యర్థిగా పోటీ చేస్తానని రాష్ట్ర ప్రజారోగ్యశాఖ డైరెక్టర్‌(డీహెచ్‌) డా.గడల శ్రీనివాసరావు అన్నారు.

Updated : 11 Jun 2023 06:59 IST

కొత్తగూడెం పట్టణం, న్యూస్‌టుడే: వచ్చే ఎన్నికల్లో సీఎం కేసీఆర్‌ అవకాశమిస్తే కొత్తగూడెం నియోజకవర్గం నుంచి భారాస అభ్యర్థిగా పోటీ చేస్తానని రాష్ట్ర ప్రజారోగ్యశాఖ డైరెక్టర్‌(డీహెచ్‌) డా.గడల శ్రీనివాసరావు అన్నారు. కొత్తగూడెం శ్రీనగర్‌ కాలనీలోని ‘జనహితం’ కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. తాను పుట్టిన కొత్తగూడెం ప్రాంతంలో జీఎస్సార్‌ ట్రస్టు నెలకొల్పి విద్య, వైద్యం, ఉపాధి కల్పనకు కృషి చేస్తున్నట్లు వివరించారు. స్వతంత్రంగా లేదా ఇతర పార్టీల తరఫున పోటీ చేసే ఆలోచన లేదన్నారు. ఉపాధి అవకాశాలు వెతుక్కొంటూ కొత్తగూడెం నుంచి ఎంతోమంది హైదరాబాద్‌, సుదూర ప్రాంతాలకు తరలివెళ్తున్నారని.. ఈ నేపథ్యంలో ‘కొత్త కొత్తగూడెం’ నిర్మాణమే లక్ష్యంగా సేవా కార్యక్రమాలకు ప్రణాళిక రూపొందిస్తున్నట్లు చెప్పారు. దీనిపై నియోజకవర్గ ప్రజలకు రాసిన బహిరంగ లేఖను ఆయన విడుదల చేశారు. కొత్తగూడెం సర్వజన ఆసుపత్రిలో రూ.2 కోట్లతో ట్రామా కేంద్రాన్ని అందుబాటులోకి తెస్తున్నామన్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని