వైకాపా సర్కారును సాగనంపేందుకు ఎన్నారైలు నడుం బిగించాలి

వైకాపా ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలు, స్వార్ధపూరిత రాజకీయ కుట్రలతో ఆంధ్రప్రదేశ్‌లో వ్యవస్థలన్నీ గాడితప్పుతున్నాయని ఎంపీలు రఘురామకృష్ణరాజు, కనకమేడల రవీంద్రకుమార్‌ ధ్వజమెత్తారు.

Updated : 14 Jul 2023 06:10 IST

ఎంపీలు రఘురామ, కనకమేడల

ఈనాడు-అమరావతి: వైకాపా ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలు, స్వార్ధపూరిత రాజకీయ కుట్రలతో ఆంధ్రప్రదేశ్‌లో వ్యవస్థలన్నీ గాడితప్పుతున్నాయని ఎంపీలు రఘురామకృష్ణరాజు, కనకమేడల రవీంద్రకుమార్‌ ధ్వజమెత్తారు. తెలుగు వారి అభివృద్ధికి, అభ్యున్నతికి కృషి చేసిన ఎన్టీ రామారావును స్ఫూర్తిగా తీసుకుని వైకాపా సర్కారును సాగనంపేందుకు ఎన్నారైలంతా నడుం బిగించాలని పిలుపునిచ్చారు. అమెరికాలోని న్యూజెర్సీలో బుధవారం నిర్వహించిన ఎన్టీఆర్‌ శతజయంతి వేడుకలకు వారు ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. మహానటుడిగా, మహా నాయకుడిగా ఎన్టీఆర్‌ సాధించిన విజయాలు, చేసిన సేవలు చిరస్మరణీయమని తెదేపా పొలిట్‌ బ్యూరో సభ్యుడు టీడీ జనార్దన్‌, ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ బోర్డు డైరెక్టర్‌ మన్నవ మోహన కృష్ణ, భాజపా నాయకుడు పాతూరి నాగభూషణం, ఏపీ ఎన్‌ఆర్‌టీ మాజీ ఛైర్మన్‌ వేమూరి రవికుమార్‌ కొనియాడారు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి కుంటుపడిందని వారు దుయ్యబట్టారు. కార్యక్రమంలో వెనిగళ్ల మోహన్‌కుమార్‌, నల్లమల్ల రాధాకృష్ణ, వెనిగళ్ల వంశీ, పలువురు ప్రవాసాంధ్రులు పాల్గొన్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు