JP Nadda-Chandrababu: జేపీ నడ్డా, చంద్రబాబు మాటామంతీ

రాష్ట్రపతి భవన్‌లో సోమవారం జరిగిన ఎన్టీఆర్‌ శతజయంతి స్మారక రూ.100 నాణెం విడుదల సందర్భంగా భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, తెదేపా అధినేత చంద్రబాబునాయుడులు పరస్పరం వివిధ అంశాలపై మాట్లాడుకున్నారు.

Updated : 29 Aug 2023 08:39 IST

ఈనాడు, దిల్లీ: రాష్ట్రపతి భవన్‌లో సోమవారం జరిగిన ఎన్టీఆర్‌ శతజయంతి స్మారక రూ.100 నాణెం విడుదల సందర్భంగా భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, తెదేపా అధినేత చంద్రబాబునాయుడులు పరస్పరం వివిధ అంశాలపై మాట్లాడుకున్నారు. కార్యక్రమం జరిగే సాంస్కృతిక కేంద్రంలో పక్కపక్కనే కూర్చున్న వీరిద్దరూ రాష్ట్రం, దేశంలో ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిణామాల గురించి చర్చించుకున్నట్లు సమాచారం. అయితే ఇద్దరి మధ్య జరిగిన చర్చల గురించి రెండు పార్టీల నేతలెవరూ స్పందించలేదు. జూన్‌ 4న అమిత్‌షా-చంద్రబాబుల మధ్య జరిగిన సమావేశంలోనూ జేపీ నడ్డా పాల్గొన్నారు. ఇప్పుడిలా కలవడం ఇది రెండోసారి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని