NRI TDP: మంచోడు జైల్లో.. పిచ్చోడు లండన్‌లో: తెదేపా ఎన్‌ఆర్‌ఐల నిరసన
తెదేపా అధినేత చంద్రబాబు అరెస్ట్‌కు నిరసనగా లండన్‌లో తెదేపా ఎన్‌ఆర్‌ఐలు నిరసన వ్యక్తం చేశారు. జగన్ ప్రస్తుతం లండన్‌లో బస చేసిన ప్రాంతానికి సమీపంలో నిరసన కార్యక్రమం నిర్వహించినట్లు వారు తెలిపారు.
ఈనాడు, అమరావతి: తెదేపా అధినేత చంద్రబాబు అరెస్ట్‌కు నిరసనగా లండన్‌లో తెదేపా ఎన్‌ఆర్‌ఐలు నిరసన వ్యక్తం చేశారు. జగన్ ప్రస్తుతం లండన్‌లో బస చేసిన ప్రాంతానికి సమీపంలో నిరసన కార్యక్రమం నిర్వహించినట్లు వారు తెలిపారు. ‘మంచోడు జైల్లో.. పిచ్చోడు లండన్‌లో’ ‘అక్రమ అరెస్ట్‌ను ఖండిద్దాం, ప్రజాస్వామ్యాన్ని కాపాడదాం’ ‘సైకో పోవాలి.. బాబు రావాలి’ అని నినాదాలు చేసి, ప్లకార్డులు ప్రదర్శించారు. లండన్‌లో మరోచోట ఎన్‌ఆర్‌ఐ టీడీపీ ఆధ్వర్యంలో స్వాతిరెడ్డి, ఇతర కార్యకర్తలు నిరసన తెలిపారు. బ్రిటన్‌లోని ఎన్‌ఆర్‌ఐల ఆధ్వర్యంలో పార్లమెంటు ఎదుట ఉన్న గాంధీ విగ్రహం దగ్గర నిరసన తెలిపారు. చంద్రబాబు అరెస్టు అప్రజాస్వామికమన్నారు.
- ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్ నగరంలో ఎన్‌ఆర్‌ఐ తెదేపా ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఎన్‌ఆర్‌ఐలు పాల్గొని చంద్రబాబు అక్రమ అరెస్ట్‌ను ఖండించారు.
- నెదర్లాండ్స్‌లో ఎన్‌ఆర్‌ఐ తెదేపా ఆధ్వర్యంలో నిరసన నిర్వహించారు. ఏపీలో వైకాపా ప్రభుత్వ తీరును వారంతా ముక్తకంఠంతో ఖండించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Intresting News: ఈరోజు ఆసక్తికర వార్తలు మిస్సయ్యారా?.. అయితే ఇవి మీకోసమే..
-
Jawan: ‘జవాన్’ ఆఫర్.. ఒక టికెట్ కొంటే మరొకటి ఫ్రీ.. ఆ మూడు రోజులే!
-
Pakistan-New Zealand: హైదరాబాద్ చేరుకున్న పాకిస్థాన్, న్యూజిలాండ్ క్రికెట్ జట్లు
-
Amaravati: ఏపీ సచివాలయంలో 50 మంది అసిస్టెంట్ సెక్రటరీలకు రివర్షన్
-
Law Commission: ‘జమిలి’ నివేదికపై కసరత్తు జరుగుతోంది.. లా కమిషన్ ఛైర్మన్
-
IND vs AUS: టీమ్ఇండియా ఆలౌట్.. మూడో వన్డేలో ఆస్ట్రేలియా విజయం