చంద్రబాబు అరెస్టుకు నిరసనగా... వాషింగ్టన్ డీసీలో కొవ్వొత్తుల ప్రదర్శన
చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేయడం, ఆయన పట్ల అవలంబించిన తీరు ప్రజాస్వామ్య స్ఫూర్తిని కాలరాయడమేనని ప్రవాసాంధ్రులు, వారి తల్లిదండ్రులు మండిపడ్డారు.
ఈనాడు, అమరావతి: చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేయడం, ఆయన పట్ల అవలంబించిన తీరు ప్రజాస్వామ్య స్ఫూర్తిని కాలరాయడమేనని ప్రవాసాంధ్రులు, వారి తల్లిదండ్రులు మండిపడ్డారు. చంద్రబాబు అరెస్టుకు నిరసనగా అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. సతీశ్ వేమన ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పెద్దసంఖ్యలో ప్రవాసాంధ్రులు పాల్గొన్నారు. ఏపీ ప్రభుత్వ కక్షపూరిత విధానాలను తీవ్రంగా ఖండించారు. ‘నిజానిజాలు త్వరలోనే తేలతాయి. రాష్ట్ర ప్రజలు చంద్రబాబుతోనే ఎల్లప్పుడూ ఉంటారు’ అని సతీశ్ వేమన అన్నారు. ‘చంద్రబాబు ఔన్నత్యం, క్రమశిక్షణ, నిబద్ధతను కోట్లాది మంది ప్రజలు 40 ఏళ్లకు పైగా చూస్తున్నారు. ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కొన్న సమర్థుడైన చంద్రబాబు నాయకత్వానికి వారు పట్టం కడతారు’ అని భాను మాగులూరి, యష్ బొద్దులూరి అన్నారు. ‘ఈ క్లిష్ట సమయంలో సంయమనం పాటిస్తూ అధినేతకు అండగా నిలుస్తాం’ అంటూ సాయి బొల్లినేని, రవి అడుసుమిల్లి తదితరులు నినాదాలిచ్చారు. కార్యక్రమంలో సుశాంత్ మన్నె, నెహ్రూ, పుల్లారెడ్డి, రమేశ్ గుత్తా, మాల్యాద్రి, భాను వలేటి, సామంత్, మురళి, వినీల్, జాఫర్, అమ్మిరాజు, కాంతయ్య, సురేశ్, సత్యనారాయణ, బసవరావు, యుగంధర్, మాధవరావు తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Apply Now: ‘సింగిల్ గర్ల్ చైల్డ్’కు సీబీఎస్ఈ స్కాలర్షిప్.. దరఖాస్తు చేశారా?
-
Hyderabad: పాతబస్తీలో ఆర్టీసీ బస్సు బీభత్సం.. నలుగురికి గాయాలు
-
October 1: దేశవ్యాప్తంగా ‘శ్రమదాన్’.. స్వచ్ఛత కోసం మోదీ పిలుపు
-
Rakshit Shetty: తెలుగు ప్రేక్షకుల ఆదరణకు రక్షిత్ శెట్టి ఫిదా.. ఏమన్నారంటే?
-
Cyber Crimes: టాస్క్ పేరుతో సైబర్ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలన్న కేంద్ర హోంశాఖ
-
Parineeti-Raghav : ఒక్కటైన ‘రాగ్ణీతి’.. లీలా ప్యాలెస్లో వైభవంగా వివాహం