బాలకృష్ణపై అంబటి రాంబాబు వ్యాఖ్యలు సరికాదు

ప్రముఖ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణపై ఆంధ్రప్రదేశ్‌ మంత్రి అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యల్ని ఖండిస్తున్నట్టు నిర్మాత నట్టికుమార్‌ గురువారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

Published : 22 Sep 2023 05:54 IST

నిర్మాత నట్టికుమార్‌

ఈనాడు, హైదరాబాద్‌: ప్రముఖ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణపై ఆంధ్రప్రదేశ్‌ మంత్రి అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యల్ని ఖండిస్తున్నట్టు నిర్మాత నట్టికుమార్‌ గురువారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు గురువారం శాసనసభలో వ్యవహరించిన తీరు ఆక్షేపణీయమన్నారు. ప్రజా సమస్యలపై చర్చలు, సమీక్షలు జరగాల్సిన దేవాలయం లాంటి శాసనసభలో మంత్రి కులాల ప్రస్తావన తీసుకురావడం, గొడవలకి వేదికగా చేసుకుని రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. చంద్రబాబుని, పవన్‌కల్యాణ్‌ని తిట్టడమే మంత్రులకి పనా అని ప్రశ్నించారు. తెదేపా నేత చంద్రబాబు అరెస్ట్‌పై నిరసన తెలిపే హక్కు, వాదన వినిపించే స్వేచ్ఛ ఆ పార్టీ ఎమ్మెల్యేలకి ఉంటుందన్నారు. నారా భువనేశ్వరి, బ్రాహ్మణిలను లక్ష్యంగా చేసుకుని మరో మంత్రి రోజా ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం సమంజసం కాదన్నారు. మంత్రులు తమకి కేటాయించిన శాఖల్లో ఏ స్థాయిలో అభివృద్ధి జరిగిందో ప్రజలకి చెప్పాలని డిమాండ్‌ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు