మాజీ సీఎం అరెస్టు అప్రజాస్వామికం

తెదేపా అధినేత చంద్రబాబు అరెస్టు అప్రజాస్వామికమని రాష్ట్ర శాసనసభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. అరెస్టును ఆయన తీవ్రంగా ఖండించారు.

Published : 23 Sep 2023 05:19 IST

సభాపతి పోచారం

బీర్కూర్‌, న్యూస్‌టుడే: తెదేపా అధినేత చంద్రబాబు అరెస్టు అప్రజాస్వామికమని రాష్ట్ర శాసనసభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. అరెస్టును ఆయన తీవ్రంగా ఖండించారు. కామారెడ్డి జిల్లా బీర్కూర్‌ మండలం సంబాపూర్‌, బైరాపూర్‌ గ్రామాల్లో నిర్మించిన 67 రెండు పడక గదుల ఇళ్లను శుక్రవారం సభాపతి ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ.. అకారణంగా చంద్రబాబును అరెస్టు చేయడం ముమ్మాటికీ రాజకీయ కక్ష సాధింపు చర్య అని వ్యాఖ్యానించారు. సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తిని అరెస్టు చేసి జైల్లో పెట్టడం మంచి పద్ధతి కాదన్నారు. చేతిలో అధికారం ఉందని ఇలా చేయడం పెద్ద తప్పని.. ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీయడం అవుతుందని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని