మహిళా బిల్లును తక్షణం అమలు చేయాలి

మహిళా రిజర్వేషన్‌ బిల్లును తక్షణమే అమలు చేయాలని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ డిమాండ్‌ చేశారు.

Published : 23 Sep 2023 05:19 IST

రాహుల్‌ గాంధీ డిమాండ్‌

దిల్లీ: మహిళా రిజర్వేషన్‌ బిల్లును తక్షణమే అమలు చేయాలని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ డిమాండ్‌ చేశారు. యూపీఏ ప్రభుత్వ హయాంలో రూపొందించిన బిల్లులో ఓబీసీలకు రిజర్వేషన్లు పొందుపరచకపోవడంపై విచారం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం కులగణనను చేపట్టి అందులో తేలిన అంశాలను, యూపీఏ హయాంలో చేపట్టిన కులగణన వివరాలనూ బహిర్గతం చేయాలని కోరారు. జనగణన, నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియతో ముడిపెట్టిన కారణంగా మరో 10 ఏళ్ల వరకూ మహిళా రిజర్వేషన్లు అమల్లోకి వచ్చే అవకాశం లేదని నిట్టూర్చారు. ఈ బిల్లును తీసుకురావడంలో కేంద్రం ఉద్దేశం రాజకీయ ప్రయోజనం పొందడమేనని విమర్శించారు. మహిళా బిల్లుకు పార్లమెంటు ఆమోదం తెలిపిన నేపథ్యంలో రాహుల్‌ శుక్రవారం దిల్లీలో కాంగ్రెస్‌ ప్రధాన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. తాను బిల్లుకు మద్దతిస్తూనే బలహీన, ఇతర నిమ్న వర్గాలకు చెందిన మహిళలకు వారి జనాభా నిష్పత్తిని అనుసరించి కోటా కల్పించాలని కేంద్రాన్ని కోరినట్లు తెలిపారు. మహిళా రిజర్వేషన్లను వాయిదా వేసేందుకే డీలిమిటేషన్‌, జనాభా లెక్కలు వంటి కుంటిసాకులు చెబుతోందని భాజపా ప్రభుత్వంపై కాంగ్రెస్‌  ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్‌ ట్విటర్‌లో మండిపడ్డారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని