విద్యావిధానం అభాసుపాలు

రాష్ట్రంలో అస్తవ్యస్తంగా మారిన విద్యావిధానం, నిరుద్యోగ సమస్యపై విపక్ష ఎమ్మెల్సీలు మండిపడ్డారు. శుక్రవారం మీడియాపాయింట్‌లో వారు మాట్లాడారు.

Published : 23 Sep 2023 05:44 IST

జగన్‌ సర్కారుపై విపక్ష ఎమ్మెల్సీల మండిపాటు

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో అస్తవ్యస్తంగా మారిన విద్యావిధానం, నిరుద్యోగ సమస్యపై విపక్ష ఎమ్మెల్సీలు మండిపడ్డారు. శుక్రవారం మీడియాపాయింట్‌లో వారు మాట్లాడారు.


30 వేల టీచర్‌ పోస్టులు భర్తీ చేస్తేనే పాఠశాలలు నడిచేది
- పీడీఎఫ్‌ ఎమ్మెల్సీ లక్ష్మణరావు

‘రాష్ట్రంలో తక్షణం డీఎస్సీ పెట్టి 30 వేల ఉపాధ్యాయ ఖాళీలు భర్తీ చేస్తే తప్ప పాఠశాల విద్య ముందుకెళ్లదు. 8,300 ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి డీఎస్సీ నిర్వహిస్తున్నట్టు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మండలిలో రాతపూర్వకంగా సమాధానమిచ్చారు. ఏపీలో 40 వేల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నట్టు పార్లమెంటులో కేంద్ర మానవవనరుల శాఖ చెప్పింది. మరి ఆ ఖాళీల సంగతేమిటో మంత్రి సమాధానం చెప్పాలి.’


విద్యా వ్యవస్థ కునారిల్ల్లుతోంది
- ఎమ్మెల్సీ వెంకటేశ్వరరావు

‘ఏటా డీఎస్సీ నిర్వహించి ఖాళీలను భర్తీ చేయాల్సిన ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడంతో విద్యా వ్యవస్థ దెబ్బతింది. జాబ్‌ క్యాలెండర్‌, డీఎస్సీపై మండలిలో వాయిదా తీర్మానమిస్తే ఛైర్మన్‌ తిరస్కరించడం శోచనీయం.’


ఏటా జాబ్‌ క్యాలెండర్‌ పేరుతో మోసం
- ఎమ్మెల్సీ షేక్‌ సాబ్జి

‘ఏటా జాబ్‌ క్యాలెండర్‌ ప్రకటించి ఖాళీలు భర్తీ చేస్తామని ప్రభుత్వం చెప్పి నిరుద్యోగులను మోసం చేసింది.’


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని