అసెంబ్లీ నిర్వహణకు తెదేపా ఆటంకాలు

అసెంబ్లీలో తెదేపా సభ్యుల వైఖరిని మంత్రులు ప్రశ్నించారు. సభ నిర్వహణకు ఆటంకం కలిగించారని మండిపడ్డారు.

Published : 23 Sep 2023 05:44 IST

మంత్రుల మండిపాటు

ఈనాడు, అమరావతి: అసెంబ్లీలో తెదేపా సభ్యుల వైఖరిని మంత్రులు ప్రశ్నించారు. సభ నిర్వహణకు ఆటంకం కలిగించారని మండిపడ్డారు. శుక్రవారం మీడియా పాయింట్‌లో వారు మాట్లాడారు.


చర్చిద్దామంటే పారిపోయిన తెదేపా ఎమ్మెల్యేలు
- మంత్రి బొత్స సత్యనారాయణ

‘నైపుణ్యాభివృద్ధి సంస్థలో కుంభకోణం, చంద్రబాబు అరెస్టుపై చర్చిద్దామంటే తెదేపా సభ్యులు సభ  నుంచి పారిపోయారు. చంద్రబాబు తప్పు చేయకపోతే చర్చకు వారెందుకు భయపడుతున్నారు? తెదేపా సభ్యులు రెండు రోజులుగా సభలో      ప్రవర్తించిన తీరు, మాట్లాడే భాష చూస్తుంటే అసహ్యం కలుగుతోంది. అసెంబ్లీ సమయాన్ని వృథా చేయడమే ధ్యేయంగా ప్రవర్తించి బయటకు వెళ్లిపోయారు. ప్రజలంతా గమనిస్తున్నారు. అంతిమంగా న్యాయమే గెలుస్తుంది.’


తెదేపా సభ్యుల అనవసర రాద్ధాంతం
- మంత్రి అంబటి రాంబాబు

‘చంద్రబాబు అరెస్టు నుంచి నైపుణ్యాభివృద్ధి సంస్థలో కుంభకోణంపైనా చర్చిద్దామని చెబుతున్నా.. తెదేపా సభ్యులు సభలో అనవసర రాద్ధాంతం సృష్టించారు. తప్పు చేయనప్పుడు చర్చిద్దామంటే ఎందుకు ముందుకు రాలేదు? సభలో చర్చ జరగకూడదన్నదే లక్ష్యంగా వారు వ్యవహరించారు. ప్రజా సమస్యలు చర్చించే వేదికైన అసెంబ్లీ సమయాన్ని దుర్వినియోగం చేయడం సరైనది కాదు. తన తండ్రి ఎన్టీఆర్‌ను అవమానించినపుడు బాలకృష్ణ మీసం తిప్పితే బాగుండేది.’


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని