25 అసెంబ్లీ, 4 పార్లమెంటు స్థానాల్లో పోటీ చేస్తాం

రాష్ట్రంలో 25 అసెంబ్లీ, నాలుగు పార్లమెంటు స్థానాల్లో సీపీఎం పోటీ చేయనుందని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ప్రకటించారు.

Published : 23 Sep 2023 05:44 IST

సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు

మంగళగిరి, న్యూస్‌టుడే: రాష్ట్రంలో 25 అసెంబ్లీ, నాలుగు పార్లమెంటు స్థానాల్లో సీపీఎం పోటీ చేయనుందని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ప్రకటించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో సీపీఎం శాఖ కార్యదర్శుల సమావేశాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రానున్న ఎన్నికల్లో మంగళగిరిలో కూడా తమ పార్టీ పోటీ చేయనుందన్నారు. ప్రజల్లో బలాన్ని పెంచుకోవటంతో పాటు ఉద్యమ శక్తులను కాపాడుకోవడానికి ఎన్నికల్లో పోటీ చేస్తామని పేర్కొన్నారు. తెదేపా, వైకాపాలు భాజపాకు లొంగిపోయి సలాం చేస్తున్నాయని ఆరోపించారు.

ఎన్డీఏతో కలిసి ఉంటామని జనసేన స్పష్టంగా చెప్పిందని, ఆ పార్టీతో తెదేపా కలిసి ఉండటంలో అర్థమేంటని ప్రశ్నించారు. పార్లమెంటులో భాజపాపై అవిశ్వాస తీర్మానాన్ని ఆ పార్టీలు వ్యతిరేకించాయని గుర్తుచేశారు. రాష్ట్రానికి ద్రోహం చేసినా, భాజపాకు ఎలా మద్దతిస్తున్నారో వారు చెప్పాలని డిమాండ్‌ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని