పర్చూరులో ఫారం-7 విచారణలో నిబంధనల ఉల్లంఘన

ఎన్నికల కమిషన్‌ నిబంధనలకు విరుద్ధంగా బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గంలో ఫారం-7 విచారణలో ఉల్లంఘనలు చోటు చేసుకుంటున్నాయని తెదేపా ఎమ్మెల్యేలు ఏలూరి సాంబశివరావు, గొట్టిపాటి రవికుమార్‌, డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి తెలిపారు.

Published : 23 Sep 2023 05:44 IST

రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి తెదేపా ఎమ్మెల్యేల లేఖ

మార్టూరు, న్యూస్‌టుడే: ఎన్నికల కమిషన్‌ నిబంధనలకు విరుద్ధంగా బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గంలో ఫారం-7 విచారణలో ఉల్లంఘనలు చోటు చేసుకుంటున్నాయని తెదేపా ఎమ్మెల్యేలు ఏలూరి సాంబశివరావు, గొట్టిపాటి రవికుమార్‌, డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి తెలిపారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేశ్‌కుమార్‌ మీనాను కలిసి శుక్రవారం వినతిపత్రం అందజేశామన్నారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన అధికారులపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి చర్యలు     తీసుకోలేదని, కొందరు నేతల ఒత్తిడితోనే వారిని కొనసాగిస్తున్నారని అన్నారు. తెదేపా సానుభూతిపరుల ఓట్లు తొలగించేందుకు అధికార పార్టీ నేతలు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. క్షేత్ర స్థాయి విచారణలో ఇష్టానుసారం వ్యవహరించిన జిల్లా ఎన్నికల అధికారి, ఎన్నికల రిటర్నింగ్‌   అధికారి, ఆయన సహాయకులపై తక్షణమే విచారించి చర్యలు తీసుకోవాలని కోరామన్నారు. అలాగే పర్చూరు నియోజకవర్గం ఎలక్ట్రోరల్‌ రిజిస్ట్రేషన్‌ అధికారి ఎన్నికల మార్గదర్శకాలను ఉల్లంఘిస్తూ ఓటర్లకు నోటీసులిస్తున్నారని ఆరోపించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని