జగన్‌.. 151 అడుగుల గోతిని తవ్వుకున్నారు

‘జగన్‌ 16 నెలలు జైల్లో ఉన్నారు. ఆయనపై సీబీఐ, ఈడీ కేసులున్నాయి. రూ.43 వేల కోట్లు జప్తు చేశారు.

Published : 23 Sep 2023 05:44 IST

మాజీ మంత్రి దేవినేని ఉమా

ఈనాడు, కాకినాడ, న్యూస్‌టుడే, టి.నగర్‌ (రాజమహేంద్రవరం): ‘జగన్‌ 16 నెలలు జైల్లో ఉన్నారు. ఆయనపై సీబీఐ, ఈడీ కేసులున్నాయి. రూ.43 వేల కోట్లు జప్తు చేశారు. ఈ 52 నెలల్లో ఒక్క రోజైనా జగన్‌ వీటిపై కోర్టుకు వెళ్లారా? డబ్బు, అధికారం, వ్యవస్థతో ఆయన ఆటలాడుతున్నారు. కోడికత్తి కేసులో సాక్ష్యం చెప్పడానికీ వెళ్లడం లేదు. దీనిపై జగన్‌ రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి’ అని తెదేపా మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు నిలదీశారు. రాజమహేంద్రవరానికి శుక్రవారం వచ్చిన ఆయన పట్టాభితో కలిసి మీడియాతో మాట్లాడారు. ఎలాంటి ఆధారాలు లేకపోయినా, ఎఫ్‌ఐఆర్‌లో పేరు లేకపోయినా అర్ధరాత్రి బస్సు తలుపులు తట్టి సీఐడీ అధికారులు చంద్రబాబును అరెస్టు చేయడంపై ఉమా అభ్యంతరం తెలిపారు. ‘జగన్‌రెడ్డీ మీ పనైపోయింది. ఎప్పుడు ఎన్నికలు జరిగినా మిమ్మల్ని, మీ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలిపేస్తారు. 151 అడుగుల గోతిని మీరు తవ్వుకున్నారు. ఆ గోతిలో మీ ప్రభుత్వాన్ని పూడ్చిపెట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు’ అని ఉమా ధ్వజమెత్తారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని