మద్యం అక్రమాలపై సీబీఐ విచారణ కోరతాం

రాష్ట్రంలో మద్యం అక్రమాలపై సీబీఐ విచారణను తప్పనిసరిగా కోరతామని భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి వెల్లడించారు.

Published : 23 Sep 2023 05:44 IST

భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో మద్యం అక్రమాలపై సీబీఐ విచారణను తప్పనిసరిగా కోరతామని భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి వెల్లడించారు. విజయవాడ భాజపా రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటుచేసిన కేంద్ర ప్రభుత్వ ఫొటో ఎగ్జిబిషన్‌ను శుక్రవారం ప్రారంభించాక విలేకర్లతో ఆమె మాట్లాడారు. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలోని ఓ మద్యం దుకాణంలో జరిగిన విక్రయాలను గురువారం పరిశీలిస్తే.. రూ.లక్ష వరకు చేపట్టిన విక్రయాల్లో కేవలం రూ.700కు మాత్రమే డిజిటల్‌ చెల్లింపులైనట్లు గుర్తించామన్నారు. ప్రతి రోజూ మద్యం విక్రయాల ద్వారా రాష్ట్రవ్యాప్తంగా అనధికారికంగా వైకాపా నేతల జేబుల్లోకి భారీ మొత్తాలు వెళ్తున్నాయని ఆరోపించారు. ప్రజల జేబుల నుంచి డబ్బులు దోచుకుని ఉచితాలు ఇస్తున్నామనేలా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుండడం శోచనీయమని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని