నన్ను వైకాపా అభ్యర్థిగానే చూస్తున్నారు: స్పీకర్‌ తమ్మినేని

రాష్ట్రంలో రాజకీయ వేడి నెలకొందని సభాపతి తమ్మినేని సీతారాం అన్నారు. శనివారం కుటుంబ సభ్యులతో కలిసి ద్వారకాతిరుమల వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు.

Published : 24 Sep 2023 04:37 IST

ద్వారకాతిరుమల, న్యూస్‌టుడే: రాష్ట్రంలో రాజకీయ వేడి నెలకొందని సభాపతి తమ్మినేని సీతారాం అన్నారు. శనివారం కుటుంబ సభ్యులతో కలిసి ద్వారకాతిరుమల వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. అనంతరం మాట్లాడుతూ.. ‘‘సభలో తెదేపా సభ్యుల చేష్టలపై మాట్లాడాలంటే బాధగా ఉంది. నేను వైకాపా ప్రాథమిక సభ్యుడిని. జగన్‌ టికెట్‌ ఇస్తే గెలుపొందా. అంతమాత్రాన తెదేపా సభ్యులు నన్ను వైకాపా అభ్యర్థి కోణంలోనే చూస్తే ఎలా. ‘స్కిల్‌’ స్కాంపై చర్చను వారు సద్వినియోగం చేసుకోలేదు’’ అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని