జగన్‌ బెయిల్‌పై పదేళ్ల వేడుక

చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ.. జగన్‌కు బెయిలొచ్చి పదేళ్లయిన సందర్భంగా తెదేపా అధికార ప్రతినిధి మహాసేన రాజేశ్‌ కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం ఉత్తరకంచి గ్రామంలో శనివారం వినూత్న కార్యక్రమం నిర్వహించారు.

Published : 24 Sep 2023 04:37 IST

మహాసేన రాజేష్‌ వినూత్న నిరసన 

ప్రత్తిపాడు, న్యూస్‌టుడే: చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ.. జగన్‌కు బెయిలొచ్చి పదేళ్లయిన సందర్భంగా తెదేపా అధికార ప్రతినిధి మహాసేన రాజేశ్‌ కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం ఉత్తరకంచి గ్రామంలో శనివారం వినూత్న కార్యక్రమం నిర్వహించారు. జగన్‌ బెయిల్‌కు పదేళ్ల వేడుక పేరున ఈ నిరసన చేపట్టారు. సీఎం జగన్‌పై ఉన్న కేసుల వివరాలతో 38 కేకులను అమర్చి వాటిని పార్టీ శ్రేణుల సమక్షంలో కోశారు. సీఎంపై ఉన్న కేసుల వివరాలను ప్రదర్శిస్తూ మీడియా సమావేశంలో మాట్లాడారు. రూ.లక్ష కోట్ల అక్రమాలకు పాల్పడిన జగన్‌ 16 నెలలు జైల్లో ఉండి బయటకు వచ్చారన్నారు. దోచిన సొమ్ముతో ఎలా రాజకీయాల్లోకి రావాలి? అందులో కొంత జనానికి ఖర్చుపెట్టి ఎలా ముఖ్యమంత్రి అవ్వాలి? మళ్లీ రూ. ఐదారులక్షల కోట్లు ఎలా గడించాలో తెలిసిన గొప్ప శాస్త్రవేత్త అని ఎద్దేవా చేశారు. రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయాలో చంద్రబాబుకు తెలిస్తే.. జగన్‌కు మాత్రం ఎలా కూల్చాలో తెలుసని విమర్శించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని