మీరు జైల్లో ఉన్నప్పుడు అలా అనలేదేం?

చట్టం ముందు అందరూ సమానమేనని సీఎం జగన్‌తో కలిసి 16 నెలలు జైలు జీవితం గడిపినప్పుడు అనలేదేం? అని వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డిని అమరావతి బహుజన ఐకాస అధ్యక్షుడు పోతుల బాలకోటయ్య ప్రశ్నించారు.

Published : 24 Sep 2023 04:37 IST

విజయసాయిరెడ్డికి బాలకోటయ్య ప్రశ్న

ఈనాడు డిజిటల్‌, అమరావతి: చట్టం ముందు అందరూ సమానమేనని సీఎం జగన్‌తో కలిసి 16 నెలలు జైలు జీవితం గడిపినప్పుడు అనలేదేం? అని వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డిని అమరావతి బహుజన ఐకాస అధ్యక్షుడు పోతుల బాలకోటయ్య ప్రశ్నించారు. అప్పట్లో సోనియాగాంధీనే కుట్ర చేశారని చెప్పారు గుర్తులేదా? అని నిలదీశారు. ‘చట్టం ముందు అందరూ సమానమే.. 73 ఏళ్ల చంద్రబాబును అరెస్టు చేస్తే తప్పేంటి?’ అంటూ విజయసాయిరెడ్డి చేసిన ట్వీట్‌పై ఆయన స్పందించారు. ‘‘నిజమా విజయసాయి గారు.. మిమ్మల్ని అరెస్టు చేస్తే మాత్రం కుట్రలు, చంద్రబాబును చేస్తే కాదా? ఇప్పుడైనా చెప్పండి మీపై పెట్టిన 11 సీబీఐ, 7 ఈడీ కేసులు నిజమని’’ అని బాలకోటయ్య శనివారం రీట్వీట్‌ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని