లోకేశ్‌, అచ్చెన్నాయుడిని జైలుకు పంపడానికి జగన్‌ కుట్ర

చంద్రబాబుపై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపినట్లుగానే తెదేపా ప్రధాన కార్యదర్శి లోకేశ్‌, రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడును కూడా కారాగారానికి పంపేందుకు జగన్‌ కుట్రలు పన్నుతున్నారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు.

Published : 27 Sep 2023 06:56 IST

అవనిగడ్డ, న్యూస్‌టుడే: చంద్రబాబుపై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపినట్లుగానే తెదేపా ప్రధాన కార్యదర్శి లోకేశ్‌, రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడును కూడా కారాగారానికి పంపేందుకు జగన్‌ కుట్రలు పన్నుతున్నారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. కృష్ణా జిల్లా అవనిగడ్డలోని తెదేపా కార్యాలయం వద్ద కొనసాగుతున్న రిలే దీక్షా శిబిరాన్ని ఆయన మంగళవారం సందర్శించి మాట్లాడారు. రాష్ట్రంలో రోజుకు రూ.2,400 కోట్ల దోపిడీ జరుగుతుందని దేవినేని ఆరోపించారు. లెక్కలు బయటకు రావడంతో జగన్‌ విశాఖపట్నంకు మకాం మార్చేస్తున్నారని దుయ్యబట్టారు. వచ్చే ఎన్నికల్లో తెదేపా, జనసేన కూటమి గెలుపు ఖాయమన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని