రాజ్యాంగంపై కక్షగట్టిన జగన్‌ ప్రభుత్వం

రాజ్యాంగంపై కక్షగట్టినట్లుగా జగన్‌ ప్రభుత్వం వ్యవహరిస్తోందని, రాజ్యాంగంలోని ప్రతి నిబంధనకూ తూట్లు పొడుస్తోందని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు.

Published : 27 Sep 2023 05:35 IST

వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు

ఈనాడు, దిల్లీ: రాజ్యాంగంపై కక్షగట్టినట్లుగా జగన్‌ ప్రభుత్వం వ్యవహరిస్తోందని, రాజ్యాంగంలోని ప్రతి నిబంధనకూ తూట్లు పొడుస్తోందని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. దిల్లీలో మంగళవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. ఎలాగూ ఓడిపోతున్నామని తెలిసీ వైనాట్‌ 175 అంటూ ప్రగల్భాలు పలుకుతున్నారని ఎద్దేవా చేశారు. గత శాసనసభ ఎన్నికలకు ముందు వారంలో సీపీఎస్‌ రద్దుచేస్తామని చెబితే ఉద్యోగులంతా తమ పార్టీకి మద్దతు ఇచ్చారని తెలిపారు. తెదేపాకు, తమ పార్టీకి 10 శాతం ఓట్ల వ్యత్యాసం ఉందని అనుకుంటే... తెదేపా, జనసేన కూటమిగా ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించుకోవడంతో ఆ వ్యత్యాసం ఇప్పుడు లేకుండా పోయిందన్నారు. అంగన్‌వాడీ కార్యకర్తలు, మహిళలు జగన్‌ పాలనపై తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారని తెలిపారు. తెదేపా అధినేత చంద్రబాబు అక్రమ అరెస్టును నిరసిస్తూ మాజీ మంత్రి పరిటాల సునీత తన ఇంట్లో నిరాహార దీక్ష చేపడితే ఒక్కరోజు కాకముందే ఆమె దీక్షను భగ్నం చేశారని ఆయన మండిపడ్డారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని