కాంగ్రెస్‌కు మల్లన్న సినిమా చూపిస్తా: మంత్రి మల్లారెడ్డి

ఎంత గొప్పోళ్లయినా, ధనవంతులైనా సరే క్రమశిక్షణ ఉల్లంఘిస్తే పార్టీ వారిని డిస్మిస్‌ చేస్తుందని.. మల్కాజిగిరిలో కూడా అదే జరిగింది కాబట్టే వాళ్లకు భారాస నుంచి బీ-ఫాం ఇచ్చే పరిస్థితి లేదని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు.

Updated : 28 Sep 2023 07:03 IST

గౌతంనగర్‌, న్యూస్‌టుడే: ఎంత గొప్పోళ్లయినా, ధనవంతులైనా సరే క్రమశిక్షణ ఉల్లంఘిస్తే పార్టీ వారిని డిస్మిస్‌ చేస్తుందని.. మల్కాజిగిరిలో కూడా అదే జరిగింది కాబట్టే వాళ్లకు భారాస నుంచి బీ-ఫాం ఇచ్చే పరిస్థితి లేదని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. మంత్రి, మల్కాజిగిరి పార్లమెంటు నియోజకవర్గ బాధ్యుడు మర్రి రాజశేఖర్‌రెడ్డిల నేతృత్వంలో బుధవారం ఆనంద్‌బాగ్‌ అంబేడ్కర్‌ విగ్రహం వద్ద నుంచి మల్కాజిగిరి కూడలి వరకు భారాస కార్యకర్తలు భారీ ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ధూంధాంలు.. సాంస్కృతిక కార్యక్రమాలను అట్టహాసంగా నిర్వహించారు. మల్కాజిగిరి కూడలిలో ఏర్పాటుచేసిన సమావేశంలో మల్లారెడ్డి మాట్లాడుతూ.. రాముడు లాంటి రాజశేఖర్‌రెడ్డిని ఆదరించి పెద్ద మెజారిటీతో గెలిపించాలని కోరారు. 70 రోజుల కష్టపడితే చాలు.. కాంగ్రెస్‌ పార్టీకి డిపాజిట్లు కూడా రావని, ప్రతి ఒక్కరూ భారాసకు ఓట్లు వేయాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. కాంగ్రెస్‌ పార్టీకి మల్లన్న సినిమా చూపిస్తానని హెచ్చరించారు. కాంగ్రెస్‌ నుంచి ఎంపీగా గెలుపొందిన రేవంత్‌రెడ్డి ఒక్కనాడైనా మల్కాజిగిరి ప్రజలకు కనిపించాడా అని ప్రశ్నించారు. మల్కాజిగిరికి మిషన్‌ భగీరథ కింద మంచినీటి సరఫరా తెచ్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. భారాస అంటే స్కీంలని.. కాంగ్రెస్‌ పార్టీ అంటే స్కాంలని ఎద్దేవాచేశారు. ప్రజలకు సేవ చేసేందుకే రాజకీయాల్లోకి వచ్చామని మర్రి రాజశేఖర్‌రెడ్డి అన్నారు. అరుంధతి ఆసుపత్రి ద్వారా అనేక మందికి ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్నామని పేర్కొన్నారు. మల్కాజిగిరి నియోజకవర్గంలో రైల్వే గేట్ల వద్ద ఆర్‌యూబీలు, మహీంద్రాహిల్స్‌లో మరో మంచినీటి రిజర్వాయర్‌ నిర్మించాల్సిన అవసరం ఉందన్నారు. వాటిని ప్రణాళిక ప్రకారం పూర్తిచేస్తామన్నారు.  కార్యక్రమంలో గౌతంనగర్‌, నేరేడ్‌మెట్‌, అల్వాల్‌ కార్పొరేటర్లు సునీత, మీనా, శాంతి, మల్కాజిగిరి మాజీ కార్పొరేటర్‌ జగదీష్‌గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు