నిరసనలు.. నిరాహార దీక్షలు

తెదేపా అధినేత నారా చంద్రబాబునాయుడు అక్రమ అరెస్టును నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు కొనసాగుతున్నాయి.

Published : 28 Sep 2023 05:12 IST

ఈనాడు, హైదరాబాద్‌: తెదేపా అధినేత నారా చంద్రబాబునాయుడు అక్రమ అరెస్టును నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు కొనసాగుతున్నాయి. ఆయనను విడుదల చేయాలని కోరుతూ తెదేపా శ్రేణులు బుధవారం రిలే నిరాహార దీక్షలు నిర్వహించాయి. నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలో జరిగిన రిలే నిరాహార దీక్షల్లో పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు. షాద్‌నగర్‌లో రిలే నిరాహార దీక్ష చేపట్టారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గం అన్నపురెడ్డిపల్లిలో నిరసన ర్యాలీ చేపట్టారు. ఇందులో తెదేపా నియోజకవర్గ ఇన్‌ఛార్జి కాట్రం స్వామి దొరతో పాటు పలువురు తెదేపా, కాంగ్రెస్‌ నాయకులు పాల్గొన్నారు. అక్రమ కేసులు తొలగిపోయి.. చంద్రబాబు త్వరగా నిర్దోషిగా బయటకు రావాలని కోరుతూ హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ భవన్‌లో వినాయకుడికి ప్రత్యేక పూజలు చేశారు. నాయకులు అజ్మీరా రాజునాయక్‌, బియ్యని సురేశ్‌, తాళికొట్టు హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని