ఎస్సీల ఓట్లతో నెగ్గి వారిపైనే వేధింపులు

ఎస్సీల ఓట్లతో అధికారంలోకి వచ్చిన వైకాపా వారిపైనే వేధింపులకు పాల్పడుతోందని మాజీ ఎంపీ జి.వి.హర్షకుమార్‌ ఆరోపించారు.

Published : 28 Sep 2023 05:18 IST

ప్రభుత్వంపై మాజీ ఎంపీ హర్షకుమార్‌ విమర్శలు

రాజమహేంద్రవరం  (దేవీచౌక్‌), న్యూస్‌టుడే: ఎస్సీల ఓట్లతో అధికారంలోకి వచ్చిన వైకాపా వారిపైనే వేధింపులకు పాల్పడుతోందని మాజీ ఎంపీ జి.వి.హర్షకుమార్‌ ఆరోపించారు. తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం గోపాలపురానికి చెందిన ఎస్సీ ఉద్యోగినిపై అధికారులు కులవివక్షకు పాల్పడినా ఇంతవరకు చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. రాజమహేంద్రవరంలో ఆయన మాట్లాడారు. ‘తిరుమలాయపాలెం సచివాలయంలో పనిచేస్తున్న పశుసంవర్థక శాఖ సహాయకురాలిని డా.కృష్ణవేణి మానసికంగా ఇబ్బందులకు గురిచేేస్తున్నారు. ఆమెకు ప్రత్యేకంగా కుర్చీ వేసి, స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మిఠాయిలు కూడా చేతితో తీసుకోనివ్వలేదు. ఉన్నతాధికారులకు, పోలీసులకు ఫిర్యాదు చేసినా బాధితురాలికి న్యాయం జరగలేదు’ అని పేర్కొన్నారు. మాజీ సీఎంని ఇబ్బంది పెట్టడం, అరెస్టులు చేయడం తప్ప జగన్‌ ప్రభుత్వం చేసిందేమీ లేదని హర్షకుమార్‌ విమర్శించారు. బాధిత ఉద్యోగిని మాట్లాడుతూ తాను అనారోగ్యంతో సెలవుపెట్టి మళ్లీ విధులకు వెళితే కృష్ణవేణి కులవివక్ష చూపుతూ చాలా ఇబ్బందులకు గురిచేశారన్నారు. రాజానగరం వైకాపా శాసనసభ్యుడు జక్కంపూడి రాజా తన భర్త బంధువంటూ బెదిరింపులకు పాల్పడ్డారని వాపోయారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని