‘ఈ ఎమ్మెల్యే మాకొద్దు’

పార్టీని తొలి నుంచి నమ్ముకుని, పార్టీ విజయానికి కష్టపడి గెలిపించిన నాయకులు, కార్యకర్తలను అణగదొక్కుతున్న తిరుపతి జిల్లా సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం తమకు వద్దని సింగిల్‌ విండో ఛైర్మన్‌, వైకాపా మండల మాజీ కన్వీనరు హరిశ్చంద్రారెడ్డి ధ్వజమెత్తారు.

Published : 28 Sep 2023 05:18 IST

పిచ్చాటూరు, న్యూస్‌టుడే: పార్టీని తొలి నుంచి నమ్ముకుని, పార్టీ విజయానికి కష్టపడి గెలిపించిన నాయకులు, కార్యకర్తలను అణగదొక్కుతున్న తిరుపతి జిల్లా సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం తమకు వద్దని సింగిల్‌ విండో ఛైర్మన్‌, వైకాపా మండల మాజీ కన్వీనరు హరిశ్చంద్రారెడ్డి ధ్వజమెత్తారు. ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ఏకపక్ష తీరుపై నిరసనగా బుధవారం పిచ్చాటూరు బస్టాండు వద్ద అసమ్మతి వర్గీయులతో భారీ బహిరంగ సభ నిర్వహించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను ఓడించడానికి కారణమైన పార్టీ ద్రోహులకు పదవులు కట్టబెట్టడం అన్యాయమన్నారు. తెదేపా నుంచి వలస వచ్చిన నేతలకు పార్టీ పదవులు కట్టబెట్టడం ఎంతవరకు సమంజసమని దుయ్యబట్టారు. రానున్న ఎన్నికల్లో ఆయనకు మళ్లీ టికెట్‌ ఇవ్వొద్దని అధిష్ఠానానికి విన్నవించారు. అనంతరం వైఎస్‌ఆర్‌, అంబేడ్కర్‌ విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. నల్లబ్యాడ్జీలు ధరించి నల్ల జెండాలతో నిరసన ర్యాలీ చేశారు. ఎంపీటీసీలు వేలు, తామరసెల్వి, సర్పంచులు రోస్‌రెడ్డి, సతీష్‌, భూపతి, రాజా, అయ్యప్పన్‌, సీనియర్‌ నాయకులు ప్రతాప్‌రెడ్డి, సురేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు