దేశంలో రికార్డుస్థాయి నిరుద్యోగిత

కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ ఇటీవల దిల్లీలోని ఆనంద్‌విహార్‌ రైల్వేస్టేషన్‌లో కూలీలతో తాను సంభాషించిన వీడియోను బుధవారం సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు.

Published : 28 Sep 2023 05:24 IST

కేంద్రంపై రాహుల్‌గాంధీ ధ్వజం
రైల్వే కూలీలతో సంభాషణ వీడియోను సామాజిక మాధ్యమాల్లో పంచుకున్న కాంగ్రెస్‌ అగ్రనేత

దిల్లీ: కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ ఇటీవల దిల్లీలోని ఆనంద్‌విహార్‌ రైల్వేస్టేషన్‌లో కూలీలతో తాను సంభాషించిన వీడియోను బుధవారం సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. కూలీలు తమ సమస్యలను రాహుల్‌కు తెలియజేయడం అందులో కనిపించింది. రికార్డు స్థాయిలో నిరుద్యోగత, ద్రవ్యోల్బణం వంటి సమస్యలు ఉన్నాయంటూ రాహుల్‌ ఆ వీడియోలో కేంద్రంపై ధ్వజమెత్తారు. రైల్వే కూలీలకు జీతం, పింఛను, ఆరోగ్య బీమా, ఇతర ప్రభుత్వ సదుపాయాలేమీ లేవని పేర్కొన్నారు. ప్రభుత్వం మారాక వారి బతుకులు మారతాయనే ఆశతో వారున్నట్లు తెలిపారు. కొద్దికాలం క్రితం తాను ఓ కూరగాయల వ్యాపారితో మాట్లాడినప్పుడు కొందరు కూలీలు తనను కలవాలని ఆశపడుతున్నట్లు చెప్పారని, ఆందుకే రైల్వేస్టేషన్‌లో వారిని కలిశానని రాహుల్‌ పేర్కొన్నారు. వారితో మాట్లాడాక వారి జీవితాలను దగ్గరగా తెలుసుకున్నానని, వారి కష్టాలను అర్థం చేసుకున్నానని తెలిపారు. ‘లక్షల మంది యువత ఉన్నత చదువులు చదివి కూడా నేడు కూలీలుగా పని చేయాల్సిన దుస్థితి దేశంలో ఉంది. నిరుద్యోగత రికార్డు స్థాయిలో నానాటికీ పెరిగిపోతోంది. అధిక ధరలతో కూలీలు రోజూ సంపాదించే రూ.400 నుంచి రూ.500 కనీసం ఇంటి ఖర్చులకు కూడా సరిపోవట్లేదు.’ అని ఆయన పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని